Leading News Portal in Telugu

Balineni Srinivasa Reddy: నకిలీ స్టాంపులు, భూకబ్జాలపై సిట్.. రిపోర్ట్‌ రెడీ అవుతుంది..


Balineni Srinivasa Reddy: నకిలీ స్టాంపులు, భూకబ్జాలపై సిట్.. రిపోర్ట్‌ రెడీ అవుతుంది..

Balineni Srinivasa Reddy: నకిలీ స్టాంపులు, భూకబ్జాల విషయంలో సిట్ వేయించాం.. సిట్ రిపోర్ట్ కూడా రెడీ అవుతుందని తెలిపారు మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి.. ఒంగోలులో ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. కలెక్టర్, ఎస్పీలతో ఇప్పటికే ఇదే విషయమై మాట్లాడాం.. నిందితుల్లో మా సొంత పార్టీ సహా ఏ పార్టీ వాళ్లు ఉన్నా ఉపేక్షించేది లేదని చెప్పాం అని స్పష్టం చేశారు. భాద్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.. మా పార్టీలో కావాలని మిస్ లీడ్ చేసి ఎవరిపైనైనా చర్యలు తీసుకుంటే అండగా ఉంటామని.. నేతలు తప్పు చేసి వాళ్లపై చర్యలు తీసుకుంటే ఎవరూ ఏమి చేయలేరని తెలిపారు.

జిల్లాలోని నేతలు, కార్యకర్తలతో మొదటి నుంచి తనకు మంచి సంబంధాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు బాలినేని.. వాళ్ల కోసం అవసరమైతే సీఎం వైఎస్‌ జగన్ తో మాట్లాడతానన్న ఆయన.. టీడీపీ సింగిల్ గా పోటీ చేయవచ్చు కదా..? అని ప్రశ్నించారు. పొత్తు లేకుంటే ముందుకు వెళ్లలేని పరిస్థితి వాళ్లది (తెలుగుదేశం పార్టీ) అని ఎద్దేవా చేశారు. మరోవైపు.. చంద్రబాబు జైలు విషయంలో టీడీపీ నేతలు కావాలని నానాయాగి చేస్తున్నారని మండిపడ్డారు.. చంద్రబాబును ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి. కాగా, ఏపీ స్కిల్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉండగా.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే.