Leading News Portal in Telugu

Minister Kottu Satyanarayana: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి


Minister Kottu Satyanarayana: ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

Minister Kottu Satyanarayana: దసరా ఉత్సవాల ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయని దేవాదాయ శాఖామంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాల ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ప్రణాళిక ప్రకారం అన్ని ఏర్పాట్లు జరిగాయని ఆయన వెల్లడించారు. కేశఖండన చేసుకున్న వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఇటీవల కొండచరియలు విరిగిపడిన దగ్గర తగు జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి చెప్పారు. సబ్ కలెక్టర్ కార్యాలయం, వీఎంసీలో ఒక టికెట్ కౌంటర్ పెట్టామని ఆయన తెలిపారు.

3500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రోటోకాల్ వీవీఐపీలకు మాత్రమే అంతరాలయ దర్శనం కల్పిస్తున్నామన్నారు. పాలు, మజ్జిగ, బిస్కెట్లు క్యూలైన్లలో ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం రాకకు ప్రత్యేక ఏర్పాటు చేశామన్నారు. బీఎస్ఎన్ఎల్, ఫైబర్ నెట్, యాక్ట్‌ నుంచీ కనెక్షన్లు దసరాకు తీసుకున్నామన్నారు. కొండచరియలు విరిగిపడకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన తెలిపారు. వృద్ధులకు ఉదయం, సాయంత్రం రెండు స్లాట్లు ఉంటాయన్నారు. సేవాసమితుల ఆధ్వర్యం లో వృద్ధులకు సేవలు అందిస్తామని మంత్రి చెప్పారు.

దసరాకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరిగాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. విజయదశమి అందరికి మంచి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.