Leading News Portal in Telugu

Atchannaidu: చంద్రబాబుకు ప్రాణహాని ఉంది..



Atchannaidu

Atchannaidu: విశాఖ టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద ‘న్యాయానికి సంకెళ్లు ఇంకెన్నాళ్లు’.. నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబును తీవ్రవాదిలా రాజమండ్రి సెంటర్ జైల్లో పెట్టారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. స్కిల్ స్కాంలో ఒక్క రూపాయి, ఎవరికైనా వెళ్ళినట్టు చూపించలేకపోయారని ఆయన పేర్కొన్నారు.

Also Read: Balakrishna: అతను ఇండస్ట్రీకి దొరికిన ఒక వరం..

ఆయన మాట్లాడుతూ.. “ఈ అరెస్టు వెనక, కుట్ర ఉంది.. ఆయనకి ప్రాణహాని ఉందని ముందు నుండి చెబుతున్నాం.. నిన్న(శనివారం) ఏసీ పెట్టమని కోర్టు చెప్పిన ఈరోజు, సాయంత్రం వరకు కూడా పెట్టలేదు. ఆయన ఆరోగ్యంపై అందరిలో ఆందోళన ఉంది. ఆయనకు ఎయిమ్స్‌లో లేదా ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించాలి. 72 నుండి 66 తగ్గారంటే ఆ రిపోర్ట్ ఇవ్వడం లేదు.. చంద్రబాబుకి ఏదైనా జరిగితే దానికి కర్మ కర్త క్రియ జగన్మోహన్ రెడ్డి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పోలీసులు నిర్బంధ కాండను రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు. చంద్రబాబుకి ఏం జరిగినా పూర్తి బాధ్యత జగన్‌దే. దుర్మార్గపు ప్రభుత్వాన్ని సాగినంపే సమయం దగ్గరలోనే ఉంది. చంద్రబాబు ఆదేశాలతోనే, ఎలాంటి హింసకు పాల్పడకుండా శాంతియుతంగా నిరసనలు చేస్తున్నాం. రేపు సీఎం వస్తున్నారంటే, ఇప్పటినుండి మమ్మల్ని హౌస్ అరెస్టులు చేస్తామంటున్నారు. చంద్రబాబు నాయుడు బయటకొచ్చినంతవరకు ఈ నిరసనలు కొనసాగుతాయి.” అని ఆయన అన్నారు.