
Srisailam: శ్రీశైలం ఆలయ శివాజీ గోపురంపై నాగుపాము సంచరిస్తుండడం కలకలం రేపింది. ఇవాళ్టి నుంచి దసరా మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో శివాజీ గోపురాన్ని ముస్తాబు చేస్తున్న లైటింగ్ సిబ్బంగికి నాగుపాము కనిపించింది. దీంతో వారు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. గోపురంపై నాగుపాము కనపడంతో భయంతో కిందకు దిగి ఆలయ అధికారులకు సమాచారం ఇచ్చారు.
దేవస్థానానికి చెందిన స్నేక్ క్యాచర్ కాళీ చరణకు సమాచారం ఇవ్వడంతో శివాజీ గోపురం పైకెక్కి నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ పామును స్నేక్ క్యాచర్ కాళీ చరణ్ అటవీ ప్రాంతంలో వదిలేశారు. దసరా నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం అయిన రోజే శివాజీ గోపురంపై నాగుపాము ప్రత్యక్షం కావడంతో భక్తులు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.