
వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా ప్రవేశ పెట్టిన జగనన్న సురక్ష పథకం ఏపీలోని అన్ని జిల్లాల్లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నేడు మార్కాపురం మండలం మాల్యమంతుని పాడు గ్రామంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కేపీ నాగర్జున రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగనన్న సురక్ష పథకంలో పాల్గొన్న ప్రజలకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు వైద్యశాఖ సిబ్బంది.. ఈ నేపథ్యంలో కేపీ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ.. జగనన్న సురక్ష పథకం ప్రతిఒక్కరు ఉపయోగించుకోవాలని ఆరోగ్యం కాపాడుకునే బాధ్యత మీదేనని వెల్లడించారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలంతా సంతోషం గా ఉన్నారని, అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మందులు కూడా ఉచితంగా ఇస్తారని నాగార్జునరెడ్డి అన్నారు. గనన్న సురక్ష పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ఉద్దేశంతో జగనన్న ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాడని సూచించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం, గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి పేద ప్రజలకు ఒక గొప్ప వరమని తెలియజేశారు.
అయితే.. అర్హులై ఉండి ఏ ఒక్కరూ లబ్ధి అందకుండా మిగిలిపోకూడదన్న తపనతో ఇంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా దానిని పరిష్కరించాలన్న చిత్తశుద్ధితో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ జగనన్న సురక్ష ప్రారంభించారు. అలాగే ఈ ప్రత్యేక క్యాంపుల ద్వారా సర్టిఫికెట్లు (జనన, మరణ, కుల, సీసీఆర్సీ, రేషన్ కార్డు డివిజన్, హౌస్ హోల్డ్ డివిజన్, ఆదాయం) మొదలైన 11 రకాల ధ్రువీకరణపత్రాలు సర్వీస్ ఛార్జ్ లేకుండా ఉచితంగా అందించనున్నారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులతో కూడిన టీమ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటినీ సందర్శిస్తుంది. అర్హులై ఉండి ఎక్కడైనా లబ్ధి అందని వారుంటే వారిని గుర్తించి సమస్య పరిష్కారానికి కావల్సిన పత్రాలు సేకరిస్తారు.ఈ దరఖాస్తులను సచివాలయానికి తీసుకెళ్లి వాటిని అక్కడ సమర్పించి, టోకెన్ నంబర్, సర్వీస్ రిక్వెస్ట్ నంబరు తీసుకుని వాటిని తిరిగి ఇంటి వద్దకే వెళ్లి అందజేస్తారు.