
Skill Development Case: స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ సీఐడీ విచారణ ముగిసింది. స్కిల్ కేసులో రాజేష్‌ను సీఐడీ విచారించింది. ఉదయం పదిన్నర నుంచి సీఐడీ విచారణ కొనసాగింది.
నేను ఇక్కడే ఉన్నా నా గురించి అందరూ తప్పుడు వార్తలు, తప్పుడు స్టేట్ మెంట్లు ఇచ్చారని కిలారు రాజేష్ పేర్కొన్నారు. దీనిపై చట్టపరంగా ముందుకు వెళతామన్నారు. స్కిల్ అంశంలో తనను పిలిచారని కిలారు రాజేష్ తెలిపారు. కొంత మంది కావాలని సృష్టించారని.. దీనిలో తన పాత్ర ఏమీ లేదని క్లియర్‌గా చెప్పానని ఆయన స్పష్టం చేశారు. రేపు కూడా రమ్మని చెప్పారని.. 20 నుంచి 25 ప్రశ్నలు అడిగారని ఆయన చెప్పారు. సగం ప్రశ్నలు స్కిల్‌కు సంబంధం లేని కేసులేనని ఆయన తెలిపారు. న్యాయవాది సమక్షంలోనే విచారణ జరిగిందని కిలారు వెల్లడించారు. చంద్రబాబును ఎదుర్కోలేక కేసు సృష్టించారని అన్నారు కిలారు రాజేష్.