
Ganta Srinivasa Rao: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీరికి ఇవే చివరి ఎన్నికలు అని జోస్యం చెప్పారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. విశాఖలో సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఆయనను గృహనిర్బంధం చేశారు పోలీసులు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం పర్యటన సందర్భంగా వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతి కోరాం.. నాకు 25 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది.. ప్రతిపక్షాలతో ముఖ్యమంత్రి మాట్లాడి సమస్యల కోసం చర్చించే ఆనవాయితీ ఉండేది.. ఈ ముఖ్యమంత్రి ఆ ఆనవాయితీని పక్కన పెట్టారని ఫైర్ అయ్యారు.. ఇక, రేపు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుంది.. టీడీపీ అధికారంలోకి వస్తుంది అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ఋషికొండలో జరుగుతున్న నిర్మాణం ముఖ్యమంత్రి కార్యాలయం అని చెబితే తప్పేముంది? అని ప్రశ్నించారు గంటా.. ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో దొడ్డి దారిన వస్తున్నారు.. ఇన్ని రోజులు గుర్తు రాని ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం ఇప్పుడు గుర్తొచ్చిందా..? అని నిలదీశారు. ముఖ్యమంత్రిని కలవాలని కోరుకున్నందుకు మా నాయకులు అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు.. ప్రజాస్వామ్యంలో నిరసనలు చేసుకునేందుకు హక్కు ఉందన్నారు. రేపు చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవే చివరి ఎన్నికలు అంటూ హెచ్చరించారు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.