Leading News Portal in Telugu

Gidugu Rudra Raju: ఏపీ సర్కార్ వెంటనే కుల గుణన చేపట్టాలి..


Gidugu Rudra Raju: ఏపీ సర్కార్ వెంటనే కుల గుణన చేపట్టాలి..

బీసీ కుల గణనతో సమూల మార్పులు వస్తాయని ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు అన్నారు. కుల గణన వల్ల అన్ని వర్గాలకూ లబ్ధి చేకూరుతుంది.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కుల గుణన చేపట్టాలి.. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీసీ కులాల గణనను చేపట్టాలి అని ఆయన డిమాండ్ చేశారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థలు, ఎన్జీఓలు, పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులూ అందుబాటులో ఉంటారు.. వెంటనే ఏపీలో కుల ఆధారిత జనగణన ప్రారంభించి చిత్త శుద్ధిని నిరూపించుకోవాలి అని గిడుగు రుద్రరాజు అన్నారు.

అయితే, ఈ నెల 21న కదిరిలో కులగణనపై సమావేశం ఏర్పాటు చేశామని ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. కుల గణన ప్రాముఖ్యాన్ని వివరిస్తూ పీసీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలను చైతన్యవంతం చేస్తాం.. నవంబర్ 7న నంద్యాల, 9న విజయనగరం , 10వ శ్రీకాకుళం, 11వ తేదీన విశాఖల్లో కులగణనపై సమావేశాలు.. ఈ నెల 30వ తేదీన ఏపీ పీసీసీ కొత్త కమిటీ సమావేశం.. ప్రస్తుతం ఏపీలో ఇద్దరు నేతల మధ్య రాజకీయం నడుస్తుంది అని ఆయన అన్నారు. వారి పట్ల ప్రజలు విసిగి పోయారు.. బీజేపీ ప్రత్యేక హాదా ముగిసిన అధ్యాయం అని ప్రకటించగా, 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచుతానన్న సీఎం జగన్ ఢిల్లీకి వంగి వంగి దండాలు పెడుతున్నారు అంటూ రుద్రరాజు మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు నుంచి మంచి మద్దతు వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.