Leading News Portal in Telugu

Tammineni Sitaram: పవన్‌ కల్యాణ్‌కి అoత పవనం లేదు.. టీడీపీ పని క్లోజ్‌..!


Tammineni Sitaram: పవన్‌ కల్యాణ్‌కి అoత పవనం లేదు.. టీడీపీ పని క్లోజ్‌..!

Tammineni Sitaram: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం.. శ్రీకాకుళం పర్యటనలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబును చంపితే మాకు ఏం వస్తుంది? అని ప్రశ్నించారు.. ఆయన ఎక్కడ ఉన్న ఒక్కటేనన్న ఆయన.. జైలులో సదుపాయాలపై కోర్టు ద్వారా వారు ఏమి కోరుతున్నారో అవన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.. దేశంలోని నేరగాల్లకి ఎలాగో చంద్రబాబుకి అలాగే అన్నారు. అతను ఆర్థిక నేరగాడు , మహాత్మా గాంధీనా, నెహ్రూ నా..? అంటూ ఎద్దేవా చేశారు.. అంతే కాదు.. టీడీపీ పని క్లోజ్‌.. పని అయిపోయిందని వ్యాఖ్యానించారు..

ఇక, చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ వాళ్లు ఇన్ని చేస్తున్నా సామాన్య ప్రజలలో ఎలాంటి రెస్పాన్స్‌ లేదన్నారు తమ్మినేని.. ఆర్థిక నేరగాళ్లకు ప్రజలు సపోర్ట్ చేయరన్న ఆయన.. 16 నెలలు వైఎస్‌ జగన్ ని జైలులో పెట్టారు.. కానీ, కేసులో ఏం నిరూపించుకాలేకపోయారని తెలిపారు.. మరోవైపు.. ఎంపీ స్థానంపై పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఫాలో అవుతాను అని స్పష్టం చేశారు.. మా పార్టీ రాష్ట్రంలోని 175 స్థానాల్లో పోటీ చేస్తుంది.. మరి.. టీడీపీ, జనసేన, బీజేపీలు దమ్మున్న పార్టీలయితే అనీ స్థానాల్లో ఆయా పార్టీలు పోటీ చేయాలని సవాల్‌ చేశారు. ఎంత మంది కలసి వచ్చినా ఓకే.. సీఎం వైఎస్‌ జగన్‌ సింహం.. సింహం సింగిల్ గానే వస్తుందన్నారు.. ఇక, పవన్‌ కల్యాణ్‌కి అంత పవనం లేదు.. చమడాలన్ని ఊడిపోయాయి అంటూ ఎద్దేవా చేశారు స్పీకర్‌ తమ్మినేని సీతారాం.