Village Volunteer Rapes Tenth Student: ఏపీలో మరో దారుణం.. టెన్త్ విద్యార్థినిపై వాలంటీర్ అత్యాచారం..!

Village Volunteer Rapes Tenth Student: ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థపై అనేక ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి విపక్షాలు.. ఇదే సమయంలో అక్కడక్క వాలంటీర్ల ఆగడాలు కూడా వెలుగు చూస్తూ వస్తున్నాయి.. దోపిడీలు, దొంగతనాలు.. అత్యాచారాలు.. ఇలా పలు కేసుల్లో వాలంటీర్ల పాత్ర వెలుగు చూస్తూనే ఉంది.. తాజాగా, ఏలూరులో ఓ వాలంటీర్ దుర్మార్గం వెలుగు చూసింది.. జిల్లాలోని దెందులూరు మండల పరిధిలో 10వ తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారగానికి పాల్పడ్డాడు వాలంటీర్.. ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆధార్ కార్డులు కావాలంటూ వెళ్లి.. బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడట వాలంటీర్ నీలాపు శివకుమార్.. తరచూ తమ ఇంటికి వస్తుండడాన్ని గమనించి తల్లిదండ్రులు బాలికన నిలదీయడంతో.. అసలు విషయం వెలుగు చూసినట్టు తెలుస్తోంది.. ఆధార్ కార్డు కావాలంటూ వచ్చి తనను లోబర్చుకున్నట్టు.. ఆ తల్లిదండ్రుల దగ్గర వాయిపోయిందట విద్యార్థిని.. దీంతో.. వాలంటీర్ నీలాపు శివకుమార్ పై దెందులూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు బాధితురాలి తల్లిదండ్రులు..
ఇక, శివకుమార్‌పై కేసు నమోదు చేసిన దెందులూరు పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థపై అనేక ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి విపక్షాలు.. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చేసిన కామెంట్లు తీవ్ర కలకలమే రేపాయి.. వాలంటీర్లలో కొందరు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.. ఇక, పవన్ వ్యాఖ్యలపై వాలంటీర్లు న్యాయపోరాటానికి దిగిన విషయం విదితమే కాగా.. మరోవైపు ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అలాంటి వారిపై వెంటనే చర్యలు కూడా తీసుకుంటూ వస్తోంది సర్కార్.