
Nellore Crime: ఆంధ్రప్రదేశ్‌లో 8 నెలల గర్భిణి తన తల్లితో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది.. 8 నెలల గర్భిణి అయిన మహిళ.. తన భర్త మరణించడంతో.. తీవ్ర మనో వేదనతో ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు.. నెల్లూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరులోని విక్రమ్ నగర్లో తల్లి.. కూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. 8 నెలల గర్భిణిగా ఉన్న భాను లత తన తల్లి లక్ష్మితో కలిసి విక్రమ్ నగర్ లో నివాసం ఉంటున్నారు.. అయితే, ఇటీవలే భాను లత భర్త సుధాకర్ రెడ్డి అనారోగ్య కారణాలతో మరణించాడు.. అప్పటి నుంచి ఆమె తీవ్రస్థాయిలో మనస్థాపానికి గురయ్యారు.. భర్త లేని జీవితం వ్యర్థమని భావించి తల్లితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. అందరితో ఎంతో ఆప్యాయంగా ఉండే తల్లీ కూతుళ్లు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారనే సమాచారం తెలియడంతో వారి బంధువులు. మిత్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.. ఆమె ఆత్మహత్యకు బలమైన కారణం ఉంటుందని భావిస్తున్నారు. సుధాకర్‌రెడ్డి మరణించడాన్ని తట్టుకోలేకే.. తల్లీ కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారా..? వారు జీవితాన్ని చాలించడం వెనుక ఇంకా ఏవైనా బలమైన కారణాలు ఉన్నాయా? నేది తెలియాల్సి ఉంది. ఇక, స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.