
Minister Merugu Nagarjuna about AP CM YS Jagan: సమాజంలో దళితులు గౌరవంగా బతికేలా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చూస్తున్నారు అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. రాష్ట్రంలో దళిత, గిరిజనుల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్ అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. ప్రజల కోసం కష్టపడే సీఎం జగన్‌ను వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దళితుల కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించేందుకే సామాజిక న్యాయ చైతన్య యాత్రని నిర్వహిస్తున్నామని మంత్రి నాగార్జున తెలిపారు.
నెల్లూరు జిల్లాలో మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ… ‘రాష్ట్రంలో దళిత, గిరిజనుల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్ అధిక ప్రాధాన్యమిస్తున్నారు. దళితుల కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించేందుకే సామాజిక న్యాయ చైతన్య యాత్రని నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ పథకాలలో అవినీతి లేకుండా దళితులకు అందిస్తున్నారు. దళితులు గౌరవంగా బతికేలా చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ జగన్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు.
‘సామాజిక బస్ యాత్రలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు మోసాలను ఎండగడతాం. అందరూ సీఎం జగన్‌కు అండగా ఉండాలి. గతంలో దళితులు తమ పథకాల కోసం లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. మాజీ సీఎం చంద్రబాబు హయాంలో దళితులపై దాడులు ఎక్కువగా జరిగాయి. దళితుల గురించి ఆయన ఏనాడూ పట్టించుకోలేదు. మన సీఎం జగన్ దళితులకు అండగా నిలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైసీపీని గెలిపించుకుందాం’ అని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు.