Leading News Portal in Telugu

Minister Ambati Rambabu: నిజమే నిజం గెలుస్తుంది.. అందుకే చంద్రబాబు జైల్లో..!


Minister Ambati Rambabu: నిజమే నిజం గెలుస్తుంది.. అందుకే చంద్రబాబు జైల్లో..!

Minister Ambati Rambabu: చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత టీడీపీ వరుస కార్యక్రమాలకు సిద్ధం అవుతుంది.. ఈ నేపథ్యంలో.. చంద్రబాబుపై సెటైర్లు వేశారు మంత్రి అంబటి రాంబాబు.. తాడేపల్లిలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నిజం గెలవాలి అనే పేరుతో యాత్ర చేయనున్నారని ప్రకటించారు.. లోకేష్ యువగళం యాత్ర ఆపేస్తున్నారని ఆ పార్టీ ప్రకటించింది.. నిజమే.. అందరం నిజం గెలవాలనే కోరుకుంటున్నాం. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి నిజం గెలుస్తుంది.. కాబట్టే, చంద్రబాబు జైల్లో ఉన్నారని పేర్కొన్నారు. గత 45 రోజుల నుంచి నిజమే గెలుస్తోందన్న ఆయన.. ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు నిజమే గెలుస్తోందన్నారు. నిజం గెలవాలని కోరుకుంటున్న వారు 17ఏ ని పెట్టుకుని ఎందుకు పాకులాడుతున్నారు? 17ఏ సాంకేతిక అంశాన్ని అడ్డం పెట్టుకుని నిజాన్ని ఎందుకు తొక్కి పెట్టాలని అనుకుంటున్నారు? అంటూ నిలదీశారు.

ఇక, చంద్రబాబు అరెస్టు అయితే 105 మంది గుండెలు పగిలి చనిపోయారట.. ఇది పెద్ద జోక్ గా అభివర్ణించారు అంబటి.. చంద్రబాబు వల్ల చనిపోయిన వారి ఆత్మలు శాంతిస్తున్నాయి.. ఎన్టీఆర్ ఆత్మ, నందమూరి హరికృష్ణ, రంగా పింగళి దశరధరామ, గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు వల్ల చనిపోయిన వారి ఆత్మలు శాంతిస్తున్నాయన్నారు. చనిపోయిన కుటుంబాలను పరామర్శిస్తాను అన్న బాలకృష్ణ ఇంత వరకు ఎందుకు వెళ్లలేదు..? ఇప్పుడు భువనేశ్వరి పరామర్శిస్తారు అని ఎందుకు అంటున్నారు? ములాఖాత్ లో ఏ కుట్ర జరిగింది? అని అనుమానాలు వ్యక్తం చేశారు. తమకే భవిష్యత్తులేని వాళ్లు ప్రజల భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తారట.. క్వాష్ ఎలాగూ రాదు.. బెయిల్ కూడా వచ్చే అవకాశం లేదని న్యాయవాదులు చెప్పేసినట్లు ఉన్నారు.. అందుకే భువనేశ్వరి, లోకేష్ యాత్రల అంటున్నారు అని ఎద్దేవా చేశారు.

ఇక, టీడీపీ నేతలు గవర్నర్ ను, కేంద్ర హోం మంత్రి ని కలవటం డ్రామాగా అభివర్ణించారు అంబటి.. ఇది చాలా సీరియస్ కేసు.. చట్టానికి వ్యతిరేకంగా వారు ఎందుకు నిర్ణయాలు తీసుకుంటారు.. విచారణను చంద్రబాబు ఎదుర్కోవలసిందే అన్నారు. మరోవైపు.. పవన్ కల్యాణ్‌, బీజేపీ కలిసి ఉన్నాయా లేవా అన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయన్నారు. తెలంగాణలో బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు ఇక్కడ టీడీపీతో ఎలా పొత్తు పెట్టుకుంటాడు? అని ప్రశ్నించారు. పవన్ రాజకీయాలకు పనికి రాడు.. ఒకరితో ఉంటూ వేరే వారి వ్యవహారం చేయటం పవన్ కు అలవాటే అని విమర్శించారు. జైలుకు వెళ్లి టీడీపీతో పొత్తు పెట్టుకున్న పవన్ కల్యాణ్‌ తర్వాత ఎందుకు స్పందించడం లేదు? అని నిలదీశారు. రాజకీయాల్లో కూడా నైతిక విలువలు లేని వ్యక్తి పవన్ కల్యాణ్‌ అని మండిపడ్డారు. పవన్ ను నమ్మవద్దని కాపు సోదరులను కోరుతున్నాను అన్నారు మంత్రి అంబటి రాంబాబు.