Leading News Portal in Telugu

Margani Bharat: స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో నిజమే గెలిచింది..


Margani Bharat: స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో నిజమే గెలిచింది..

Margani Bharat: స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిజమే గెలిచిందని అంటున్నారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ . నారా భువనేశ్వరి నిజం గెలవాలని యాత్ర చేయడంలో అర్థం లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అరెస్టు అయితే చనిపోయింది ఎవరో చెప్పాలని ప్రశ్నించారు. రాజమండ్రిలో ఎంపీ మార్గాని భరత్ రామ్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కుటుంబ సభ్యులే ఆనందంగా ఉన్నారు ఇంకెవరు చనిపోతారని అన్నారు. బాలకృష్ణ సినిమా రిలీజ్ ఫంక్షన్‌లో కేరింతలు కొడుతున్నాడని, ఇంకా బాధ ఎవరికని ఆయన ప్రశ్నించారు. ప్రజా క్షేత్రంలోకి వచ్చి బలం నిరూపించుకోవాలి కానీ అబద్ధపు మాటలతో కాదని భరత్ వ్యాఖ్యానించారు.