Leading News Portal in Telugu

Supreme Court: చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌.. విచారణ వచ్చే నెలకు వాయిదా


Supreme Court: చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌.. విచారణ వచ్చే నెలకు వాయిదా

Supreme Court: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫైబర్‌ నెట్‌ కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తీర్పు వచ్చేంతవరకు ఆగాలని సుప్రీంకోర్టు సూచించింది.. చంద్రబాబు జైలు లోనే ఉన్నారు.. దర్యాప్తు చేసుకోవచ్చు కదా అని సీఐడీకి సూచించింది ధర్మాసనం. “ఫైబర్ నెట్” కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు పిటిషన్‌ దాఖలు చేయగా.. ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ టెండర్ల కేటాయింపులలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని అభియోగాలు నమోదు చేసింది సీఐడీ.. చంద్రబాబు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ కంపెనీ “టేరా సాప్ట్” కు నిబంధనలు ఉల్లంఘించి అనుచిత లబ్ధి చేకూర్చారని ఆరోపించింది.. బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని..
అవినీతి జరిగిందని చెబుతోంది..

ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం కాగా.. చంద్రబాబు తరఫున వాదనలు వినిపించారు సిద్దార్ధ్ లూద్రా.. అయితే, చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చేంతవరకు వేచి చూడాలన్నారు జస్టిస్ బోస్.. ఇక, చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై నవంబర్‌ 8వ తేదీన తీర్పు వెలువడనుండా.. ఇప్పుడు ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను నవంబర్‌ 9వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. కాగా, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయిన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న విషయం విదితమే.. గత నెల 9వ తేదీన అరెస్ట్‌ అయిన చంద్రబాబు రిమాండ్‌ 42వ రోజుకు చేరింది.. ఇక, ఆయన రిమాండ్‌ను నవంబర్ 1వ తేదీ వరకు విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం గురువారం రోజు పొడిగించిన విషయం విదితమే.