
రేపు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఏపీ సీఎం జగన్ పాల్గొననున్నారు. అయితే, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం చేపడతారు. ఉదయం 8 గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేరుకోనున్నారు. కాగా, సీఎం జగన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం ప్రసంగం తర్వాత పోలీస్ అమరవీరులకు ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తారు.
అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమం అనంతరం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ కార్యక్రమం అనంతరం ఉదయం 10.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి రాజ్ భవన్ కు ఆయన వెళ్లనున్నారు. అక్కడ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన తర్వాత తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వెళ్లనున్నారు. అక్కడ ఏపీ హైకోర్టు నూతన జడ్జిల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం మళ్లీ తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ చేరుకోనున్నారు. అయితే, ఈ పెరేడ్ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ తో పాటు రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.