Leading News Portal in Telugu

AP: భార్యకి శ్రీమంతం.. మృత్యు ఒడిలోకి భర్త


AP: భార్యకి శ్రీమంతం.. మృత్యు ఒడిలోకి భర్త

నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని కడమల కాల్వలో పెను విషాదం చోటు చేసుకుంది. భార్య కీర్తికి శ్రీమంతం చేసుకునే ఇంటికి వచ్చే సరికి భార్త ఏసురాజు మృత్యు ఒడిలోకి జారుకున్నాడు. అయితే, వివరాల్లోకి వెళ్తే.. కడబల కాల్వకు చెందిన ఈ జంట ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. అయితే, కీర్తి ఐదు నెలల క్రితం గర్భం దాల్చింది. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపుకు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సిబ్బంది తరపున కీర్తికి పసుపు కుంకుమలు, సారే ఇచ్చి ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి శ్రీమంతం చేసి దీవించారు.

ఇక, ఇదే సమయంలో గడ్డి కోసం ఊరి బయటకు కీర్తి భర్త ఏసురాజు వెళ్లాడు. అక్కడ గడ్డి కోస్తుండగా ఒక్కసారిగా ఫిడ్స్ రావడంతో అతడు కేకలు వేస్తుండుగా.. ఆ తర్వాత హార్ట్ ఎటాక్ రావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఇక, శ్రీమంతం చేసుకుని ఇంటికి వచ్చిన కీర్తికి కొద్దిసేపటికి భర్త మృతదేహంతో కనిపించాడు. విగతజీవిగా భర్త ఏసుదాసును చూసి భార్య కీర్తి స్పృహ కోల్పోయింది. సమాచారం తెలుసుకుని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కడమల కాల్వ చేరుకున్నారు. కీర్తికి 20 వేల రూపాయల ఆర్థిక సాయం అందించి, అండగా ఉంటానని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి భరోసానిచ్చారు.