Leading News Portal in Telugu

Onion Price: దీపావళికి ముందు షాక్ ఇస్తున్న ధరలు.. ఎందుకంటే?


Onion Price: దీపావళికి ముందు షాక్ ఇస్తున్న ధరలు.. ఎందుకంటే?

ఉల్లి ధరలు మళ్లీ పెరగనున్నాయి..సామాన్యులకు ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.. ప్రస్తుతం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. నిత్యావసర వస్తువుల ధరలతో పాటు కూరగాయల ధరలు కూడా మండిపోతుండటం సామాన్య జనానికి భారంగా మారుతోంది.. పండుగల సీజన్ ప్రారంభం కావడంతో ద్రవ్యోల్బణం మరోసారి అసలు రంగును చూపిస్తోంది. దీంతో సామాన్య ప్రజల బడ్జెట్‌కు గండిపడింది. ముఖ్యంగా ఉల్లి ధరలు మండిపోతున్నాయి.. ప్రస్తుతం ఉల్లి ధరలు 45 నుంచి రూ.50 రూపాయలు పలుకుతున్నాయి..

ధరలు మళ్లీ భారీగా పెరుగుతాయని జనాలు ఆందోళన చెందుతున్నారు.. ఏపీలోని విశాఖపట్నంలో కిలో ఉల్లిని రూ.50కి విక్రయిస్తుండగా, రైతుబజార్‌లో కిలో ఉల్లి ధర రూ.40గా ఉంది. అదే సమయంలో ఈసారి రుతుపవనాల రాక ఆలస్యమైందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉల్లి పంటపైనా ప్రభావం పడింది. మార్కెట్‌లోకి కొత్త ఉల్లి ఉత్పత్తి ఇంకా తగినంత పరిమాణంలో రాకపోవడానికి కారణం ఇదే.. దీంతో ధరలు భారీగా పెరిగాయి,..

ఇకపోతే కర్ణాటకలోని రానుల్, బళ్లారి నుండి ఆంధ్రప్రదేశ్ అంతటా ఉల్లిపాయలు సరఫరా అవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. కానీ, ఈ రెండు ప్రాంతాల నుంచి కూడా అవసరానికి మించి ఉల్లి సరఫరా జరుగుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లికి భారీ కొరత ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడి వ్యాపారులు మహారాష్ట్ర నుంచి ఉల్లిని కొనుగోలు చేస్తున్నారు.. ఉల్లి సాగు కూడా దాదాపు 120 రోజులు ఆలస్యమైంది. నవంబరు మొదటి వారం నుంచి కొత్త ఉల్లి మార్కెట్‌లోకి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. దీని తర్వాత ఉల్లి ధరలో కొంత తగ్గుదల ఉండవచ్చు. అయితే, దీని కోసం ప్రజలు కొంచెం వేచి ఉండాలి. పండగ సీజన్లో ధరలు పెరిగితే మరింత ఇబ్బందిగా మారే అవకాశం.. ఇక చూసుకుంటే దీపావళికి ముందే ధరలు పెరగడంతో జనాలు ఆందోళనలో ఉన్నారు..