Leading News Portal in Telugu

Dussehra Special Trains: విజయవాడ మీదగా ప్రత్యేక రైళ్లు!


Dussehra Special Trains: విజయవాడ మీదగా ప్రత్యేక రైళ్లు!

Dussehra Special Trains: దసరా పండగ నేపథ్యంలో జనాలు సొంతూళ్ల బాట పట్టారు. నేడు బతుకమ్మ, రేపు దసరా నేపథ్యంలో బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ అన్ని కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ మీదగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

బెంగళూరు-సంత్రాగచి రైలు (06285/06286) అక్టోబర్ 21న బెంగళూరులో తెల్లవారుజామున 2 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.10 గంటలకు సంత్రాగచి చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో 23న సంత్రాగచిలో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి మరుసటిరోజు రాత్రి 10గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. కృష్ణరాజపురం, జోలార్‌పేట, కాట్పాడి, రేణిగుంట, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, పలాస, బరంపురం, కుర్దారోడ్‌, భువనేశ్వర్‌, కటక్‌, భద్రక్‌, బాలాసోర్‌, ఖరగ్‌పూర్‌ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

చెన్నై-భువనేశ్వర్‌ రైలు (06073/06074) అక్టోబర్ 23, 24, 30, 31.. నవంబరు 6, 7 తేదీల్లో చెన్నైలో రాత్రి 11.45కి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6.30 గంటలకు భువనేశ్వర్‌ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో భువనశ్వర్‌లో రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు చెన్నై చేరుతుంది. గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, విజయనగరం, పలాస, కుర్దారోడ్‌ స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుంది.

చెన్నై-సంత్రాగచి రైలు (06071/06072) అక్టోబర్ 21, 23, 28, 30.. నవంబరు 4, 6 తేదీల్లో చెన్నైలో రాత్రి 11.45కి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజాము 3.45కి సంత్రాగచి చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో సంత్రాగచిలో ఉదయం 5 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 11గంటలకు చెన్నై చేరుతుంది. గూడూరు, విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, విజయనగరం, పలాస, కుర్దారోడ్‌, భువనేశ్వర్‌, కటక్‌, భద్రక్‌, బాలాసోర్‌, ఖరగ్‌పూర్‌ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.