
52 మందితో బీజేపీ తొలి జాబితా:
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. 52 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. బీసీలతో పాటు సీనియర్లకు కూడా జాబితాలో చోటు కల్పించారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు ఎంపీలు బరిలో నిలిచారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, బోథ్ నుంచి సోయం బాపురావు, కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్ పోటీ చేస్తున్నారు. హుజారాబాద్‌తో పాటు గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ సీఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
రాజా సింగ్ సస్పెన్షన్ ఎత్తివేసిన బీజేపీ:
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ అధిష్టానం సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. మహమ్మద్ ప్రవక్తను అవమానించేలా సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసినందుకు గాను రాజాసింగ్‌ను బీజేపీ అధిష్టానం సస్పెండ్ చేసింది. 2022 ఆగస్ట్ 23న బీజేపీ నాయకత్వం రాజా సింగ్‌ను సస్పెండ్ చేసింది. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు కేంద్ర నాయకత్వాన్ని కోరారు. ఈ విషయమై జాతీయ నాయకత్వంతో రాష్ట్ర నాయకత్వం చర్చలు జరిపింది. రాజాసింగ్‌పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ క్రమశిక్షణా సంఘం ఇవాళ వెల్లడించింది.
రేవంత్ రెడ్డిపై ఎర్రబెల్లి ఫైర్:
టీపీసీసీ రేవంత్ రెడ్డిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్, ఒక చీటర్ అని అన్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడ కాళ్లు పెడితే అక్కడ పార్టీ నాశనం అయిపోతుందని ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఈ నెల 27న కేసీఆర్ సభ నేపధ్యంలో సభాస్థలిని, హెలిప్యాడ్ ను పరిశీలించిన అనంతరం ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
నెల రోజులు కష్టపడాలి:
నెల రోజులు సీరియస్ గా కష్ట పడాలని, మేనిఫెస్టోను డోర్ టు డోర్ అతికించాలని మంత్రి హరీష్ రావ్ పార్టీ శ్రేణులకు సూచించారు. జలవిహార్ లో బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జిలతో, వార్ రూమ్ సభ్యుల సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గోబెల్ ప్రచారం చేస్తోందని, వాటిని తిప్పి కొట్టాలన్నారు. మూడోవ సారీ కేసీఆర్ అధికారంలోకి రాబోతున్నారని సర్వేలు చెప్తున్నాయన్నారు. మనం అందరం సీరియస్ గా నెల రోజులు కష్ట పడాలని ఆయన సూచించారు. అవసరం అయితే రాత్రి ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ పడుకోవాలని హరీష్ రావ్ పేర్కొన్నారు.
టికెట్ కొనకపోతే ఫైన్ తప్పదు:
దేశానికి తొలి ఢిల్లీ-మీరట్ ర్యాపిడ్ రైలు బహుమతి లభించింది. ర్యాపిడ్ రైల్ నమో భారత్ తొలి రోజున అందులో ప్రయాణించేందుకు జనం భారీగా తరలివచ్చారు. నమో భారత్ తొలిరోజు సాహిబాబాద్ నుంచి దుహై వరకు 10 వేల మంది ప్రయాణించారు. అయితే, నమో భారత్ టిక్కెట్లకు సంబంధించి కొత్త అప్‌డేట్ వచ్చింది. NCRCTC నమో భారత్ టిక్కెట్ కోసం కొత్త అప్‌డేట్ విడుదల చేయబడింది. అప్‌డేట్ ప్రకారం, ప్రయాణానికి తీసుకున్న టికెట్ కేవలం రెండు గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. దీని తర్వాత ఈ టికెట్ గడువు ముగుస్తుంది. గడువు ముగిసిన టిక్కెట్‌తో ఎవరైనా పట్టుబడితే గంట ప్రాతిపదికన జరిమానా విధించబడుతుంది. జరిమానా గంటకు రూ.10 ఉంటుంది. ప్రస్తుతం జరిమానా నిబంధనను సడలించినా త్వరలో కఠినంగా అమలు చేయనున్నారు. సరాయ్ కాలే ఖాన్-మీరట్ మధ్య ప్రయాణం ఒక గంటలో పూర్తవుతుంది కాబట్టి టిక్కెట్ చెల్లుబాటును రెండు గంటలపాటు ఉంచినట్లు అధికారులు తెలిపారు.
339 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు:
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ లో భారీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 339 పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..
హార్దిక్ పాండ్యా స్థానంలో ఎవరు:
వన్డే ప్రపంచకప్ 2023లో వరుసగా నాలుగు విజయాలతో అజేయంగా సాగుతున్న భారత్, న్యూజిలాండ్ జట్లు నేడు తలపడనున్నాయి. ప్రపంచంలోని అందమైన క్రికెట్ వేదికల్లో ఒకటైన ధర్మశాలలో ఈ మెగా సమరం జరుగనుంది. ఐదవ విజయంపై ఇరు జట్లు కన్నేశాయి. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కాలి మడమ గాయంతో అర్ధంతరంగా మైదానాన్ని వీడిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. అతడి స్థానంలో భారత్ ఎవరిని ఆడిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.