Leading News Portal in Telugu

Botsa Satyanarayana: పవన్‌.. నా వద్దకు వస్తే ట్యూషన్‌ చెబుతా: బొత్స


Botsa Satyanarayana: పవన్‌.. నా వద్దకు వస్తే ట్యూషన్‌ చెబుతా: బొత్స

నూతన విద్యా విధానంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలియకుండా మాట్లాడుతున్నారని, కుంభకోణాలు అని అంటున్న పవన్‌కు తెలియకపోతే తన వద్దకు వస్తే ట్యూషన్‌ చెబుతాను అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైసీపీ పాలనలో జరిగిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించేందుకు సామాజిక న్యాయ బస్సు యాత్ర చేపట్టామన్నారు. విశాఖ గ్రాండ్‌వేలో వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి బొత్స పాల్గొన్నారు. మొదటి దశలో 12 రోజుల పాటు సామాజిక న్యాయ బస్సు యాత్ర కొనసాగుతుందని ఆయన తెలిపారు.

‘శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి అక్టోబర్ 26న సామాజిక న్యాయ బస్సు యాత్రను ప్రారంభిస్తాం. ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభలు నిర్వహిస్తాం. మొదటి దశలో 12 రోజుల పాటు సామాజిక న్యాయ బస్సు యాత్ర కొనసాగుతుంది. వైసీపీ పాలనలో జరిగిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించేందుకు సామాజిక న్యాయ బస్సు యాత్ర చేపట్టాం’ అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

‘నవరత్నాల్లో భాగంగానే దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తున్నాం. మద్యం ధరలు పెంచితే.. ప్రతిపక్షాలకు ఉలుకెందుకు?. డబ్బు మదంతో ఉన్న వారే మద్యం జోలికి వెళ్తారు. ఖరీదైన మద్యం పేదలకు దూరంగానే ఉంటుంది. ఇక నూతన విద్యా విధానంపై పవన్‌ కల్యాణ్‌ తెలియకుండా మాట్లాడుతున్నారు. బైజూస్‌ కంటెంట్‌ కోసం విద్యార్థులు, ప్రభుత్వం ఏ ఖర్చు చేయలేదు. దీని గురించి ఎన్నిసార్లు చెప్పినా.. కుంభకోణాలు అని పవన్‌ అంటున్నారు. పవన్‌కు తెలియకపోతే నా వద్దకు వస్తే ట్యూషన్‌ చెబుతా’ అని మంత్రి బొత్స విమర్శించారు.