Leading News Portal in Telugu

MLA KP Nagarjuna Reddy: పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి


MLA KP Nagarjuna Reddy: పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి

మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలతో బిజీబిజీగా గడిపారు. పొదిలి మండలంలోని పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవానికి ఆయన శ్రీకారం చుట్టారు. మండలంలోని కుంచేపల్లి పంచాయితీ పరిధిలో ఉన్న గురువాయపాలెం నుంచి దాసర్లపల్లి వరకు ఒక కోటి 45 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేశారు. అలాగే, 42 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనం ప్రారంభోత్సవం.. 22 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం భవనాన్ని కూడా ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి ప్రారంభోత్సవం చేశారు.

ఇక, 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ భవనాన్ని మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. పాములపాడు లో జలజీవన్ మిషన్లో భాగంగా 67 లక్షల రూపాయలతో ఇంటింటికి కొలాయి ప్రారంభోత్సవం..16 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రంథాలయ నూతన భవనం, 17 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ మిల్క్ సెంటర్ బిల్డింగ్ ప్రారంభోత్సవం చేశారు. ఇక, 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన విలేజ్ క్లీనింగ్ సెంటర్ భవనం ప్రారంభోత్సవం.. అలాగే, 22 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవం.. మొత్తంగా రెండు పంచాయతీలల్లో కలిపి నాలుగు కోట్ల రూపాయల అభివృద్ధి పనులను కేపీ నాగార్జున రెడ్డి ప్రారంభించారు.