Leading News Portal in Telugu

MP Rammohan Naidu: సిక్కోలు వాసులను అవమానిస్తే చూస్తూ ఊరుకోం..


MP Rammohan Naidu: సిక్కోలు వాసులను అవమానిస్తే చూస్తూ ఊరుకోం..

తెలుగు ప్రజలకు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు దసరా శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ మా అందరికి బాధాకరమైన విషయం.. తితిలీ తుఫాన్ సమయంలో మా జిల్లా ప్రజలతో కలిసి బాబు దసరా జరుపుకున్నారు.. ప్రజా నాయకుని అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారు అని ఆయన ఆరోపించారు. దేశం మొత్తం బాబు వెంట ఉన్నారు.. ఆయనకు సంఘీభావం తెలుపుతున్నారు.. టీడీపీ క్యాడర్ కేసులకు భయపడకుండా చంద్రబాబు అరెస్ట్ పై పోరాటం చేస్తున్నారు.. పుంగనూరులో సిక్కోలు వాసులను అవమానించడం దారుణం అని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పుంగనూరు భారత దేశంలో లేదా అని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. సైకిల్ యాత్ర చేస్తున్న కార్యకర్తలను అవమాణిస్తారా.. మా జిల్లా వాసులను బట్టలు విప్పి పెద్దిరెడ్డి అనుచరులు అవమానించారు.. జిల్లా వాసిగా నా రక్తం మరిగిపోతుంది.. రాయలసీమ పరువు తీస్తున్నారు పెద్దిరెడ్డి.. పార్లమెంట్ లో మిథున్ రెడ్డి నన్ను అవమానించే ప్రయత్నం చేసాడు.. ఇప్పుడు నా జిల్లా వాసులను అవమానించారు.. పెద్దిరెడ్డి క్షమాపణ చెప్పాలి అని ఆయన డిమాండ్ చేశారు. మంత్రి పదవికి రాజీనామా చేయాలి.. సిక్కోలు వాసులను అవమాణిస్తే చూస్తూ ఊరుకోం అని ఎంపీ రామ్మోహన్ నాయుడు వార్నింగ్ ఇచ్చారు.

నిరసన చేసే హక్కు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. సైకిల్ యాత్ర చేస్తున్న బీసీ వ్యక్తులని నోటికివచ్చినట్టు మాట్లాడుతారా?.. జగన్, మంత్రులు ఈ ఘటనపై ఎందుకు నోరు మెదపరు.. శ్రీకాకుళం జిల్లా వ్యక్తులను అవమాణిస్తే ఈ ప్రాంత మంత్రులు నోరు మూసుకుంటారా?.. ఉత్తరాంధ్ర రాజాధాని పేరిట వస్తున్నది మమ్మల్ని అవమానించటానికా?.. రాజారెడ్డి రాజ్యాంగం వద్దనుకునే విజయమ్మను వైజాగ్ ప్రజలు ఓడించారు.. పెద్దిరెడ్డి అండతో ఆయన అనుచరులు చెలరేగిపోతున్నారు.. పోలీసులు ఏం చేస్తున్నారు.. ఉత్తరాంధ్ర పై జగన్ ది దొంగ ప్రేమ అని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు.

ఇక్కడి ప్రజలను ఉద్ధరించటానికి కాదు.. దోచుకోవటానికి వస్తున్నారు అని రామ్మోహన్ నాయుడు అన్నారు. పెద్దిరెడ్డి పుంగనూరులో రౌడీ మాఫియాలను నడుపుతున్నారు.. పుంగనూరు లో నలుగురు వ్యక్తులకు జరిగిన అవమానం కాదు.. యావత్ ఉత్తరాంధ్ర ను అవమానించారు అని ఆయన పేర్కొన్నారు. ఇతర జిల్లాలకు వెళ్లాలంటే వీసా,పాస్ పోర్టు తీసుకోవాలా.. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.. ఒక్క ఆధారం చూపించగలరా.. జగన్ అవినీతిని ఆధారాలతో సహా ప్రజలకు వివరిస్తాం.. కాలయాపన చేసి చంద్రబాబును జైలులో నిర్బంధించాలని చూస్తున్నారు.. న్యాయం ఒకరోజు ఆలస్యంగా అయినా గెలుస్తుంది అని రామ్మోహన్ నాయుడు చెప్పారు.