Leading News Portal in Telugu

Nimmakayala Chinarajappa: చంద్రబాబు బయటకు వచ్చేలోపు టీడీపీ- జనసేన జనంలోకి వెళ్తారు..


Nimmakayala Chinarajappa: చంద్రబాబు బయటకు వచ్చేలోపు టీడీపీ- జనసేన జనంలోకి వెళ్తారు..

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుతో ములాకాత్ ముగించుకుని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి క్యాంప్ ఆఫీసుకు కుటుంబ సభ్యులు బయలుదేరారు. 40 నిమిషాల పాటు చంద్రబాబుతో నారా లోకేశ్, బ్రహ్మణీ, మంతెన సత్యనారాయణ రాజు ములాకాత్ అయ్యారు. సెంట్రల్ జైలు బయట టీడీపీ నేతలతో కలిసి లోకేశ్ మాట్లాడారు. చంద్రబాబు తోటి ములాకాత్తులో చర్చించిన విషయాలను పార్టీ శ్రేణులకు లోకేశ్ వివరించారు అని టీడీపీ సీనియర్ నేత, మాజీ హోం మంత్రి నిమ్మకాల చినరాజప్ప తెలిపారు.

చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాకాత్ ముగిసింది అని మాజీ మంత్రి చినరాజప్ప తెలిపారు. చంద్రబాబు చాలా ధైర్యంగా ఉన్నారు అందర్నీ ధైర్యంగా ఉండమన్నారు.. ప్రజలంతా ఆయన ఎప్పుడూ బయటికి వస్తారా అని ఎదురుచూస్తున్నారు.. ఆయన క్షేమంగా బయటకు రావాలని ప్రజలందరూ ప్రార్థనలు చేస్తున్నారు అంటూ ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు బయటకు వచ్చేలోపు టీడీపీ- జనసేన పార్టీలు కలిసి పలు కార్యక్రమాలతో జనంలోకి వెళ్తారు అంటూ నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు.

అయితే, దేశం చేస్తోంది రావ‌ణాసుర ద‌హ‌నం-మ‌నం చేద్దాం జ‌గ‌నాసుర ద‌హ‌నం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అరాచ‌క, విధ్వంస‌క పాల‌న సాగిస్తున్న సైకో జ‌గ‌నాసురుడి పీడ పోవాల‌ని నిన‌దిద్దాం అని పిలుపునిచ్చారు. ఇవాళ విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా రాత్రి 7 గంట‌ల నుంచి 7.05 నిమిషాల మధ్యలో వీధుల్లోకి వ‌చ్చి “సైకో పోవాలి“ అని రాసి ఉన్న ప‌త్రాల‌ను ద‌హ‌నం చేయండి అని తెలిపారు. ఆ వీడియో, ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయండి.. సైకో జ‌గ‌న్ అనే చెడుపై మంచి అనే చంద్రబాబు సాధించ‌బోయే విజ‌యంగా ఈ ద‌స‌రా పండ‌గ‌ని సెల‌బ్రేట్ చేసుకుందాం అంటూ చెప్పుకొచ్చారు.