
టీడీపీ-జనసేన జేఏసీ మీటింగ్ పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ విధానం ఏంటి అని ప్రశ్నించారు. ప్యాకేజీ స్టార్ కాబట్టే నీ విధానాన్ని తప్పు బడుతున్నామన్నారు. 2014లో కలిసి పోటీ చేశావ్… 2019లో విడిగా పోటీ చేశావ్.. ఏం చేసినా చంద్రబాబుకు ప్రయోజనం కలిగించటమే పవన్ లక్ష్యమని మంత్రి అన్నారు. చంద్రబాబుకు మనో ధైర్యాన్ని ఇవ్వటం కోసం.. లోకేష్ పల్లకి మోయటం కోసం రాజమండ్రిలో సమావేశమయ్యామన్నారు. టీడీపీ కోసమే పుట్టిన పార్టీ జనసేన అని మంత్రి అంబటి విమర్శించారు. చంద్రబాబుకు తాము బెయిల్ రాకుండా చేస్తున్నామా అని మండిపడ్డారు.
Harish Rao: ఈ దసరా లోపు సిద్దిపేటకి రైలు తెచ్చి దశాబ్దాల కల నిజం చేసుకున్నాం
పవన్ కళ్యాణ్ కు వ్యవస్థ పై అవగాహన ఉందా అని ప్రశ్నించారు. కేసు స్ట్రాంగ్ గా ఉండటం వల్లే ఏ కోర్టులోనూ రిలీఫ్ దొరకటం లేదని ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వస్తారని మొదటి రోజు నుంచే చెబుతున్నామని.. తాము చెప్పిందే జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత మంది పై కేసులు పెట్టినా బాధ అనిపించ లేదా అని ప్రశ్నించారు. పవన్ కు సొంత ఆలోచనా విధానమే లేదని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. మూడేళ్ళ కిందటే చంద్రబాబు పల్లకిని పవన్ కళ్యాణ్ మోస్తాడని చెప్పామని.. అమిత్ షా పిలిస్తేనే వెళ్ళానని లోకేష్ చెప్పాడన్నారు. ఇవాళ కిషన్ రెడ్డి వాస్తవాలు బయటపెట్టారని, పదే పదే అభ్యర్థిస్తేనే లోకేష్ కు అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారు అని కిషన్ రెడ్డి వెల్లడించారని మంత్రి పేర్కొన్నారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో పురంధరేశ్వరి, లోకేష్ మాటల్లోని డొల్లతనం బయటపడిందని మంత్రి అన్నారు.
Nara Lokesh: అభివృద్ధితో సంక్షేమం మా కూటమి నినాదం
ఎంత మంది కలిసినా జగన్ ప్రభుత్వాన్ని ఎవరూ ఏమీ చేయలేరని మంత్రి అంబటి అన్నారు. వారి మ్యానిఫెస్టో రాష్ట్రాన్ని కాపాడే విధంగా ఉంటుందో, టీడీపీని కాపాడే విధంగా ఉంటుందో చూద్దామన్నారు. జైల్లో ఉండే ప్రతి వాడు ప్రజల గుండెల్లో ఉండరని తెలిపారు. టీడీపీనే రాష్ట్రానికి పట్టిన తెగులు అని విమర్శించారు. బయటకు వస్తే సాక్ష్యాధారాలు బయటపడతాయనే చంద్రబాబును రిమాండ్ లో ఉంచారని మంత్రి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ద్వారా ఓటు కొనాలని ప్రయత్నించి చంద్రబాబు అడ్డంగా దొరికిపోయిన విషయం అందరికి తెలిసిందే కదా అని అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయటం కోసమే 17ఏ మీద పోరాడుతున్నాడని.. చంద్రబాబు దొరికిన దొంగ అని విమర్శించారు. చంద్రబాబు లోపల ఊసలు లెక్క పెట్టుకోవటం, బయట లోకేష్ రోజులు లెక్క పెట్టుకోక తప్పదని మంత్రి అంబటి తెలిపారు.