Leading News Portal in Telugu

Sri Bhramara Townships: శ్రీ భ్రమర టౌన్‌షిప్స్ 8వ వార్షికోత్సవ వేడుకలు


Sri Bhramara Townships: శ్రీ భ్రమర టౌన్‌షిప్స్ 8వ వార్షికోత్సవ వేడుకలు

Sri Bhramara Townships: నిర్మాణ రంగంలో కొత్తదనం సృష్టించాలనే ఆశయంతో 2015 సంవత్సరంలో ప్రారంభించిన శ్రీ భ్రమర టౌన్‌షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్, 30 పైగా ప్రాజెక్టులతో, 8 వేల మందికి పైగా సొంతింటి కల నెరవేర్చి, కృష్ణ, గుంటూరు, ఎన్టీఆర్‌, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో వేలాది కుటుంబాలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు అందించి, స్థిరాస్తి రంగంలో తమదైన ముద్ర వేసుకుని 8 ఏళ్లు పూర్తి చేసుకుని 9వ ఏట అడుగుపెడుతోంది.

శ్రీ భ్రమర టౌన్‌షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ తమ 8వ వార్షికోత్సవ వేడుకలను అక్టోబర్ 22వ తేదీ ఉదయం 9.00 గంటల నుంచి సిద్దార్ధ గార్డెన్స్ & కన్వెన్షన్ సెంటర్, రింగ్ రోడ్, గుంటూరులో అంగరంగ వైభవంగా నిర్వహించింది. శ్రీ భ్రమర బిజినెస్ అవార్డ్స్-2023 పేరుతో నిర్వహించిన ఈ వార్షికోత్సవ వేడుకల్లో, సంస్థ విజయాల్లో కీలకపాత్ర పోషించిన మార్కెటింగ్ టీమ్స్‌కి అవార్డులు ప్రధానం చేసి సత్కరించారు. అంతే కాకుండా ఇప్పటి వరకు శ్రీ భ్రమర టౌన్ షిప్స్ చేపట్టిన, చేపట్టబోతున్న ప్రాజెక్టులను ఆదరిస్తున్న కొనుగోలుదారులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

9వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఈ శుభ సందర్భంలో శ్రీ భ్రమర సంస్థలో పని చేస్తున్న సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు, వ్యాపారంలో సహకరిస్తున్న వ్యాపార సహచరులకు, ఆర్కిటెక్టులకు, ఇంజనీర్లకు, పెట్టుబడిదారులకు, బ్యాంకర్లకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ భ్రమర హౌసింగ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గళ్ళ రామచంద్ర రావు, సంస్థ డైరెక్టర్లు మారం చంద్ర శేఖర్, శైలారెడ్డి కోట, మురళీకృష్ణ యడ్లపల్లి, ఎం.పి.కె.లక్ష్మీపతి రాజు, శ్రీ ఎం. ఎస్. రాజు, శ్రీ భ్రమర సంస్థ సభ్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.