
టీడీపీ- జనసేన పొత్తు అనైతికమన్నారు మంత్రి చెల్లుబోయిన వేణు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజమండ్రి జైలులో చంద్రబాబు నాటకం రచిస్తున్నాడని విమర్శించారు. రేపటి నుంచి మా సైన్యం సామాజిక న్యాయ బస్సు యాత్రకు బయలుదేరుతుందని ఆయన వెల్లడించారు. అధ్యక్షుడుగా చెప్పుకోవడం తప్ప అచ్చెన్నాయుడును లోకేశ్ పక్కకు నెట్టేస్తున్నారని ఆయన అన్నారు. బీసీలు అంటే లోకేష్ కి చులకన భావమని, 2019లో నారాసుర వద జరిగిందని మంత్రి చెల్లుబోయిన వేణు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. నారాసురుడు అంటే చంద్రబాబు.. పది తలలతో వస్తున్నాడని, మీ తండ్రి మానసిక క్షోభ కి చంద్రబాబు ఎంత పరితపించాడో భువనేశ్వరి తెలుసుకోవాలన్నారు.
నీ పతి ప్రలోభాలతో రాజకీయాలు నాశనం చేసాడని, ఖచ్చితంగా నిజం గెలుస్తుందన్నారు మంత్రి చెల్లుబోయిన. భువనేశ్వరి మాత నీ బిడ్డ కు కూడా నీ భర్త అన్యాయం చేస్తాడని, చంద్ర బాబు ఇబ్బందులలో ఉన్నాడని పురందేశ్వరి రాష్ట్ర ప్రభుత్వము పై విమర్శలు చేస్తుందన్నారు. నీ మరిది ఎవరికి అయినా సాయం చేశాడా? గతము లో నువ్వే విమర్శించావంటూ మంత్రి చెల్లుబోయిన్ సెటైర్లు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ప్రయత్నం పురందేశ్వరి చేస్తున్నారని మంత్రి చెల్లుబోయిన మండిపడ్డారు. రాజకీయాల్లో చంద్రబాబు శకం ముగిసింది. చంద్రబాబు చట్టాలకు అతీతుడనుకుంటున్నాడు. దేశంలో చట్టాలు తనకు వర్తించవనే భ్రమలో ఉన్నారు. 18 కేసుల్లో స్టే తెచ్చుకున్న చంద్రబాబుకు నేడు బెయిల్ రావడం లేదు. చెప్పింది చెప్పినట్టు చేసే నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. టీడీపీ, జనసేన ఇద్దరే కాదు ఎంతమంది కలిసి వచ్చినా సీఎం జగన్ న ఏమీ చేయలేరు. జనం మనసులో జగనన్న ఉన్నాడు.. సీఎం జగన్ మనసులో జనం ఉన్నారు. జగన్, జనం బంధాన్ని ఎవరూ విడదయలేరు’ అని అన్నారు.