
చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను తట్టుకోలేక 150 మందికి పైగా చనిపోయారని వెల్లడించారు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ఇవాళ ఆమె నారావారి పల్లె లో మీడియాతో మాట్లాడుతూ.. వీరిని కలిసి అండగా ఉంటామని భువనేశ్వరి ఇవాళ భరోసా ఇచ్చారని వెల్లడించారు. ఏ మహిళా కూడా దీనిని విమర్శించదన్నారు. మంత్రి రోజా దేవుని సన్నిధి అని కూడా భావించకుండా భువనేశ్వరిని విమర్శించిందన్నారు. రోజా తన గొయ్యి తనే తవ్వుకుంటోందని అనిత విమర్శలు గుప్పించారు.
అంతేకాకుండా.. ఇదే రోజా భువనేశ్వరి కాళ్ళకు నమస్కారాలు పెట్టిన రెండు సార్లు టీడీపీ టిక్కెట్ దక్కించుకుందని, ఇలా మాట్లాడితేనే మా మాజీ మంత్రి బండారు విమర్శించారన్నారు. వెంటనే చెన్నైకు వెళ్లి బ్రతిమలాడి పాత హీరోయిన్ల చేత వీడియోలు పెట్టించుకుందన్నారు. నగరి నియోజకవర్గంలో ఎర్ర మట్టి తరలింపుపై కూడా సీబీఐ విచారణ జరిపించాలని వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. నగరిలో చికెన్ కొట్టు వ్యాపారుల దగ్గర కూడా చిల్లర తీసుకుంటోందని ఆయన అన్నారు. నీ బెంజ్, గంజి కథలు తెలుసు అని ఆమె అన్నారు. శ్రీవారి దర్శనం టిక్కెట్లు రోజా అమ్ముకుంటోందని, చారిటబుల్ ట్రస్ట్ పేరిట మంత్రి రోజా చేతివాటం ట్రస్ట్ నడుపుతోందన్నారు. లోకేష్ , పవన్ లు ఒక ఫ్రేమ్ లో కనిపిస్తేనే భయపడుతున్నారు. వారు ఇద్దరూ సీన్ లోకి దిగితే ఇక ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటూ అనిత వ్యాఖ్యానించారు. తల్లి, చెల్లి లను వాడుకొని వదిలేసిన వ్యక్తి జగన్…
అనంతరం టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ మాట్లాడుతూ.. రోజా ది డ్రైనేజీ మౌత్… రోజా కు తన భర్తను గౌరవించడం కూడా రాదు… అన్నం తినే మహిళలు ఇలా మాట్లాడరు… అన్నదమ్ములతో కలిసి రోజా నగరిని అనకొండలా మింగేస్తున్నారు అంటూ విమర్శలు గుప్పించారు.