
Buddha Venkanna: ఈ సంవత్సరం మాకు దీపావళి లేదు.. వైఎస్ జగన్ ఓడిన రోజే మాకు దీపావళి అని వ్యాఖ్యానించారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మాజీమంత్రి కొడాలి నానితో పాటు.. సీఎం జగన్‌పై మండిపడ్డారు.. జగన్ జైల్లో ఉన్నప్పుడు విజయమ్మ, షర్మిల ప్రచారం చేశారంటే.. వైఎస్ జగన్ అసమర్థుడని కొడాలి నాని చెప్తారా? అని దుయ్యబట్టారు.. కొడాలి నాని దృష్టిలో వైఎస్ జగన్ పనికిరాని వాడు.. ఇప్పటికైనా తన మనసులో మాటని కొడాలి నాని బయట పెట్టాడన్న ఆయన.. తనని అర్థాంతరంగా మంత్రి పదవి నుంచి తప్పించారనే బాధ కొడాలి నానికి ఉంది.. అందుకే జగన్ పనికిమాలిన వాడంటున్నాడని విమర్శించారు.
ఇక, కొడాలి నానికి ఎన్టీఆర్ దేవుడు అయినప్పుడు.. ఆయన కుమార్తె భువనేశ్వరి దేవత కాదా..? అని ప్రశ్నించారు బుద్దా వెంకన్న.. లాయర్ల కోసం చంద్రబాబు రూ. 35 కోట్లు ఖర్చు పెట్టారంటున్న కొడాలి నాని.. వైఎస్ జగన్ 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు రూ. 4000 కోట్లు ఖర్చు పెట్టారా? అని నిలదీశారు.. భర్తకు జరిగిన అన్యాయంపై ప్రజల్లోకి వస్తే భువనమ్మ (నారా భువనేశ్వరి)ను చూసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వణికి పోతున్నారన్నారు.. మరోవైపు నారా లోకేష్-పవన్ కల్యాణ్ కలయికతో వైసీపీకి అభ్యర్థులు కరువయ్యారని పేర్కొన్నారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాళ్లంతా జగన్ రెడ్డి అనుచరులే అంటూ సంచలన ఆరోపణలు చేశారు.. ఇక, ఈ సంవత్సరం మాకు దీపావళి లేదు. జగన్ ఓడిన రోజే అసలైన దీపావళి అని వ్యాఖ్యానించారు బుద్దా వెంకన్న.