
Jogi Ramesh: నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి చేస్తున్న యాత్రకు కౌంటర్ ఇచ్చారు మంత్రి జోగి రమేష్.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. భువనేశ్వరి నిజం గెలవాలి అని కాదు.. నిజం చెప్పాలి తల్లి అని సూచించారు.. చంద్రబాబు అసలు స్వరూపం పై భువనేశ్వరి నిజం చెప్పాలి.. 2 ఎకరాల నుంచి రెండు వేల కోట్లకు చంద్రబాబు ఎలా ఎదిగాడో భువనేశ్వరి చెప్పాలి.. దోచుకున్న సొమ్ము, దాచుకున్న సంగతులు అన్నీ భువనేశ్వరి నిజం చెప్పాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. ఇక, ఈ రోజుకు అయినా నిజం గెలిచింది కనుకే చంద్రబాబు జైల్లో ఉన్నాడన్న ఆయన.. భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర కాదు పాపపు పరిహార యాత్ర చేస్తే బాగుండేదన్నారు.. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినప్పటి నుంచి చేసిన పాపాలకు పరిహారం చేసే విధంగా యాత్ర చేయాల్సిందన్నారు.
మరోవైపు టీడీపీ-జనసేన పొత్తులపై మరింత ఘాటుగా స్పందించారు జోగి రమేష్.. పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యభిచారి అని పేర్కొన్న ఆయన.. బీజేపీతో సంసారం చేస్తున్నాను అంటాడు.. టీడీపీతో పొత్తు అంటాడు అని దుయ్యబట్టారు.. పవన్ కల్యాణ్.. చంద్రబాబుకు అమ్ముడు పోయాడు అని ఆరోపించారు. తన అభిమానులను కూడా అమ్మేస్తున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, రేపటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న బస్సు యాత్రపై మాట్లాడుతూ.. బస్సు యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన రానుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మంత్రి జోగి రమేష్.