Leading News Portal in Telugu

Seediri Appalaraju: చంద్రబాబుని క్షమించకూడదు.. మండిపడ్డ మంత్రి అప్పలరాజు


Seediri Appalaraju: చంద్రబాబుని క్షమించకూడదు.. మండిపడ్డ మంత్రి అప్పలరాజు

Seediri Appalaraju: బీసీలు జడ్జీలుగా పనికిరారని చంద్రబాబు అప్పట్లో సుప్రీంకోర్టుకు లేఖ రాశారు.. అటువంటి చంద్రబాబుని క్షమించకూడదు అన్నారు మంత్రి సీదరి అప్పలరాజు.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ఇచ్చాపురం నియోజకవర్గలో మత్స్యకార సోదరులారా మనం సమస్య మీద చంద్రబాబునాయుడు వద్దకు వెళ్తే మీ డొక్కా తీస్తా, తోలుతీస్తా అని బెదిరించారు.. గడచిన ఎన్నికల్లో తొక్కతీసి.. ఇప్పుడు చంద్రబాబుకు రాజమండ్రి జైల్లో చిప్పకూడు తినిపించాం అంటూ ఘాటు వ్యాఖ్యాలు చేశారు. ఎస్సీ, ఎస్టీల్లో ఎవరైనా పుట్టడానికి మనం కోరుకుంటామా? అని చంద్రబాబునాయుడు అన్నారు.. కానీ, మన ప్రభుత్వంలో దళితులకే ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు మన సీఎం జగన్‌.. దళితులను, మత్స్యకారులను అవమానించిన చంద్రబాబుకి తొక్కా తీయాలి కదా? తీయాలా వద్దా అంటూ ప్రజల్లో వేడిని పుట్టించారు మంత్రి.

వైద్యం, విద్యను పూర్తిగా చంద్రబాబు నిర్వీర్యం చేశారు.. ప్రభుత్వ పాఠశాలకు వెళ్లేది దళిత, బీసీ, మైనార్టీలే కదా? వైద్యానికి వెళ్లేది కూడా మన పేదలే కదా..? అందుకోసమే వైద్యం, విద్యకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు మంత్రి అప్పలరాజు.. నేడు ప్రతీ పేదవాడు చదువుకోవడానికి, వైద్యం చేయించుకోవడానికి దైర్యంగా వెళుతున్నారు.. జగన్మోహనరరెడ్డి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అక్కున చేర్చుకున్నారు.. గనుక మరలా మనం సీఎంగా జగన్మోహనరెరడ్డిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. 2024లో మన ఇచ్చాపురంలో వైకాపా అభ్యర్ధిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనది.. ఈ నియోజకవర్గంలో మరలా మనజెండా ఎగరాలి.. ఉద్దాన ప్రాంతం అంటే సీఎం జగన్‌కు ఎంతో మక్కువ.. 700 కోట్ల రూపాయలతో మంచినీటిని ప్రతీ గ్రామానికి అందింస్తున్నాం అన్నారు. అచ్చెన్నాయుడు, రామ్మోహ్నాయుడు మాట్లాడుతారు…అభివృద్ది ఏం చేశారు అంటారు.. 14 ఏళ్లు మీ ప్రభుత్వం ఏమి చేసింది..? అని నిలదీశారు. మీకు సిగ్గులజ్జా ఉంటే, మీకు దమ్ముంటే ఇది మేం చేసిన అభివృద్ధి, ఇది మేం చేసిన ప్రాజెక్టు అని చెప్పగలరా..? అని సవాల్‌ చేశారు. మూలపేటలో శరవేగంగా పోర్టును నిర్మిస్తున్నాం.. మత్స్యకారులకు అండగా ఉంటున్నాం.. శ్రీకాకుళంలో అన్ని నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో వైసీపీ అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత మీదేనని పిలుపునిచ్చారు మంత్రి అప్పలరాజు.