Leading News Portal in Telugu

Electric Vehicle: ఇకపై ఎలక్ట్రిక్ వాహనమే వాడాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశాలు..


Electric Vehicle: ఇకపై ఎలక్ట్రిక్ వాహనమే వాడాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశాలు..

Save Environment: ప్రస్తుతం మనిషి జీవన శైలి పూర్తిగా మారిపోయింది . మనిషి చేసే పనులు పర్యావరణ కాలుష్యానికి కారణం అవుతున్నాయి. పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ఎవరు ఎన్ని అవగాహన చర్యలు చేపట్టిన ఫలితం మాత్రం సూన్యం. ఈ నేపథ్యంలో ఓ జిల్లా కలెక్టర్ చెప్పడం కంటే చేయడం ఉత్తమం అని భావించాడు. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ అనే మాటను నిజం చేసాడు. తను పర్యావరణ కాలుష్య నిర్మూలనకు తనవంతు బాధ్యతగా ఇక పైన వ్యక్తిగత అవసరాలకు ముడిచమురుతో నడిచే వాహనాలను ఉపయోగించనని తన నిర్ణయాన్ని తెలియచేసారు. వివరాలలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌ లోని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్ డిల్లీరావు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు తను ఇక పైన వ్యక్తిగత అవసరాలకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని వాడాలని నిర్ణయం తీసుకున్నారు.

Read also:Uttarpradesh: ఫోన్ కోసం ప్రాణం తీశాడు.. పోలీసుల ఎన్ కౌంటర్లో బలయ్యాడు

అలానే సిబ్బంది కూడా వ్యక్తిగత అవసరాలకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని వాడాలని ఆదేశించారు. ఇలా కలెక్టర్ నుండి సిబ్బది వరకు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని వాడుతూ పర్యావరణాన్ని రక్షించే విధంగా ప్రజల్లో చైత్యం తీసుకు వచ్చేలా చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ నెడ్ కాప్ సహకారంతో అవేరా సంస్థ నుండి విద్యుత్ ద్విచక్ర వాహనం కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు పిల్లలను స్కూల్ కి తీసుకు వెళ్లేందుకు, తిరిగి తీసుకు వచ్చేందుకు, షాపింగ్ కి వెళ్లేందు కార్ ను ఉపయోగిస్తున్న కలెక్టర్ ఇక ముందు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆయన ప్రస్తావిస్తూ.. కాలుష్యాన్ని నియంత్రించి పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రజలను చైతన్య చేయడమే తన లక్ష్యం అని పేర్కొన్నారు.