
రైలు ప్రమాద సంఘటన స్థలం వద్ద రెస్క్యూ ఆపరేషన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.. పట్టాల మీద ప్రమాదానికి గురైన బోగిలను తొలగించేందుకు బాహుబలి క్రెన్ రంగం లోకి దిగింది. ప్రమాదంలో పూర్తిగా నుజ్జునుజ్జయిన ప్యాసింజర్ బోగీలను, గూడ్స్ భోగిలను తొలగించే ప్రక్రియ కొనసాగుతుంది..ఇప్పటికే లోపల చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీశారు. మరో రెండు మృతదేహలు లోపల ఉన్నట్లు భావిస్తున్నారు.. అయితే.. విజయనగరంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కారణంగా విశాఖపట్నం నుంచి వెళ్లే పలు రైళ్ల. రాకపోకలను రద్దు చేయడం జరిగింది మరికొన్నిటిని దారి మళ్లించారు రైళ్లు రద్దు కావడంతో నిన్న సాయంత్రం నుండి ప్రయాణికులు విశాఖపట్నం రైల్వే స్టేషన్ లోనే వేచి చూస్తున్నారు.
రైల్వే సమాచారాన్ని అందించడానికి రైల్వే స్టేషన్ లోపల హెల్ప్ లైన్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేశారు ప్రయాణికులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించి సహాయ చర్యలు అందిస్తున్నారు. రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విజయనగరం MIMSలో చికిత్స పొందుతున్న 29మందికి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అవసరమని వైద్యులు నిర్ధారించారు. బాధితుల్లో ఎక్కువ మంది చెస్ట్, న్యూరో సంబంధిం చిన ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు గుర్తించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు వీరందరినీ విశాఖ కేజీహెచ్ కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు., సంఘటన స్థలంకు కేజీహెచ్ వైద్యులను ఉన్నతాధికారులు పంపించారు. గాయపడి బోగీల్లో చిక్కుకున్న వాళ్ళు ఉంటే తరలించేం దుకు ప్రయత్నిస్తున్నారు.