Leading News Portal in Telugu

Bandaru Satyanaryana : చంద్రబాబుకి పవన్ కల్యాణ్ అంటే అభిమానం


Bandaru Satyanaryana : చంద్రబాబుకి పవన్ కల్యాణ్ అంటే అభిమానం

చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ అంటే అభిమానమని, అలాగే చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్ కి గౌరవమన్నారు టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇద్దరు కలిసి రాష్ట్రం బాగుపడాలని బలంగా కోరుకుంటున్నారని, టీడీపీ జనసేన కార్యకర్తలు కలిసి ఇద్దరి అధ్యక్షుల సూచనలతో ముందుకు నడవాలన్నారు. వైసీపీ పేటీఎం బ్యాచ్ చంద్రబాబు, పవన్ కళ్యాణుపై విమర్శలు చేస్తున్నారు బండారు సత్యనారాయణమూర్తి. ఇద్దరి మధ్య, రెండు పార్టీల మధ్య చిచ్చు రాజేయాలని చూస్తున్నారు బండారు సత్యనారాయణమూర్తి. ఎన్నికలకు 90 రోజులే ఉంది కాబట్టి కలిసి కార్యాచరణ వేసుకుని ముందుకు సాగాలన్నారు బండారు సత్యనారాయణమూర్తి. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పోరాటమనే ఆయుధం మనకు ఇచ్చారు.. ఆ ఆయుధంతో కలిసి ప్రభుత్వంపై యుద్ధం చేద్దామన్నారు బండారు సత్యనారాయణమూర్తి. జనసేన, టీడీపీలది ఒకే మాట ఒకే బాట అని, రెండు పార్టీల అధ్యక్షుల సూచనల మేరకు మనం ముందుకు సాగాలన్నారు బండారు సత్యనారాయణమూర్తి. తెలుగుదేశం – జనసేనలను విభజించి పాలించాలనే కుట్రతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా మన కలయిక చారిత్రక అవసరమన్నారు బండారు సత్యనారాయణమూర్తి.

అంతేకాకుండా.. ‘ఇప్పటి వరకూ రాజకీయాల్లో అంతా సిద్దాంతాపరంగా పోరాడితే, జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వ్యక్తిగతంగా కక్ష సాధిస్తున్నాడు. హత్యలు చేసే నేరస్థుడి పాలన అంతమొందించటమే మన ఉమ్మడి సిద్దాంతం. హైదరాబాద్ మరో అమరావతిలా కాకూడదని తెలంగాణ నేతలు మాట్లాడుకుంటున్నారు. ఏపీని జగన్ ఎంతలా దెబ్బతీసాడోననేది హరీష్ రావు కామెంట్లతోనే అర్ధమవుతోంది. చేగొండి సూర్యప్రకాష్, జనసేన రాష్ట్ర పరిశీలకులు. రాక్షస పాలన అంతమొందించాలని చంద్రబాబు-పవన్ కళ్యాణ్ లు చేతులు కలిపారు. వ్యక్తిగత అజెండాలు పక్కనపెట్టి ఐక్య కార్యాచరణతో ముందుకు సాగుదాం. ఇరు పార్టీల మంచి సమన్వయం తో వచ్చే ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించవచ్చు. ఓట్ల బదలాయింపు పై ఇరుపార్టీల కార్యకర్తలు కష్టపడాలి.’ అని బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యానించారు.