Leading News Portal in Telugu

Adimulapu Suresh: దళిత యువకుడిపై దాడి, మూత్రవిసర్జన ఘటన.. టీడీపీకి మంత్రి సవాల్‌


Adimulapu Suresh: దళిత యువకుడిపై దాడి, మూత్రవిసర్జన ఘటన.. టీడీపీకి మంత్రి సవాల్‌

Adimulapu Suresh: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో దళిత యువకుడు శ్యామ్‌కుమార్‌పై దాడి ఘటనలో టీడీపీ నేతలకు సవాల్‌ విసిరారు మంత్రి ఆదిమూలపు సురేష్‌.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దళిత యువకుడిపై దాడి ఘటనపై స్పందించారు.. యువకునిపై దాడి చేసిన ఘటన చాలా బాధాకరం అన్నారు.. ఈ ఘటనపై పోలీసులు తక్షణమే స్పందించారు. దాడి చేసిన వ్యక్తులపై ఇప్పటికే కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అయితే, ఈ ఘటనను టీడీపీ రాజకీయాలకు వాడుకోవాలని చూడటం నీచమైన చర్యగా మండిపడ్డారు. తప్పు చేసిన వాళ్లు ఏ పార్టీ వాళ్లైనా శిక్ష తప్పదు అని హెచ్చరించారు.. ఇటువంటి ఘటనలను మా ప్రభుత్వం సహించదని హెచ్చరించారు.. చట్టం ముందు ఎవరైనా సమానమే.. టీడీపీ నాయకులకు ప్రతి విషయాన్ని రాజకీయం చేయటం అలవాటుగా మారిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు.. ఈ కేసులో తాను జోక్యం చేసుకున్నానని టీడీపీ నేతలు ఆరోపణలు చేయటాన్ని ఖండించిన ఆయన.. కంచికచర్ల పోలీసులతో నేను మాట్లాడినట్టు నిరూపిస్తే దేనికైనా సిద్దమని సవాల్ విసిరారు మంత్రి ఆదిమూలపు సురేష్‌.. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో దళిత యువకుడు శ్యామ్‌కుమార్‌ను కారులో తిప్పుతూ దారుణంగా హింసించిన ఘటన కలకలం రేపింది.. అంబేద్కర్‌ కాలనీకి చెందిన శ్యామ్‌కుమార్‌ను.. మాట్లాడాలని పిలిచి.. బుధవారం రాత్రి కారులో ఎక్కించుకున్న ఆరుగురు యువకులు.. గుంటూరు వైపు కారును తీసుకెళ్లారు.. దారిపొడవునా తీవ్రంగా కొట్టడమే కాదు.. దాహంగా ఉందని నీటి కోసం బతిమిలాడగా.. కారును నిర్మానుష్య ప్రదేశంలో ఆపి.. ముఖంపై మూత్రవిసర్జన చేశారని బాధితుడు కన్నీరు మున్నీరయ్యారు.. శరీరంపై రక్తపు మరకలు ఉండటంతో.. చొక్కాను తీసేసి.. మరో టీషర్టు తొడిగించారని.. పాత కక్షలను మనసులో పెట్టుకునే.. ఇలా దాడి చేసి ఉంటారని పేర్కొన్నాడు.. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేశామని.. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.. ఎఫ్​ఐఆర్‌లో ఐదుగురి పేర్లను చేర్చినట్లు తెలిపారు. అయితే, బాధితుడిని పరామర్శించిన టీడీపీ నేతలు.. ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో తీవ్రంగా మండిపడ్డారు మంత్రి ఆదిమూలపు సురేష్‌.