Leading News Portal in Telugu

Minister Peddireddy: దేశంలో ఎక్కడా లేని విధంగా 99 శాతం ఎన్నికల హామీలు నెరవేర్చాం..


Minister Peddireddy: దేశంలో ఎక్కడా లేని విధంగా 99 శాతం ఎన్నికల హామీలు నెరవేర్చాం..

ఈ నెల 7న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టపర్తి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 7న పుట్టపర్తిలో రైతు భరోసా అందిస్తారు అని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో రైతు భరోసా పంపిణీ జరుగుతుంది అని మంత్రి తెలిపారు.

కొత్త జిల్లాలు ఏర్పడ్డాక మొదటి సారి జిల్లాలో ఈ కార్యక్రమం జరుగుతుంది అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 99 శాతం ఎన్నికల హామీలు నెరవేర్చాం అని తెలిపారు. మరే ముఖ్యమంత్రి ఈ స్థాయిలో ఎన్నికల హామీలు అమలు చేసిన చరిత్ర లేదు అని ఆయన వెల్లడించారు. రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకుని, రైతుల కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం కృషి చేస్తుంది.. రైతులకు ఏ ప్రభుత్వం ఇప్పటి వరకు ఇంత మేలు చేయలేదు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని ఆయన తెలిపారు. వైసీపీ సర్కార్ పై కొంత మంది చేసే ఆరోపణల్లో నిజం లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.