Leading News Portal in Telugu

Samajika Sadikara Bus Yatra: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం జగన్


Samajika Sadikara Bus Yatra: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం జగన్

శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు. సంక్షేమ పథకాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లకే అత్యధిక లబ్ది చేకూరింది.. జగన్ జైత్రయాత్ర ఆపే శక్తి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లకు లేదు అని ఆయన పేర్కొన్నారు.

పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ మాట్లాడుతూ.. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేశారు.. సీఎం జగన్ కు వెనుక బడిన వర్గాలు రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు. అణగారిన వర్గాల విద్యార్థుల అభ్యున్నతి కోసమే ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టారు అని శంకర్ నారాయణ తెలిపారు.
ఇక, మాజీ ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ.. నాకు రాజకీయ భిక్ష పెట్టింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్దపీట వేశారు అని ఆమె తెలిపారు. బీసీ మహిళ అయిన నాకు టీడీపీలో సరైన గుర్తింపు ఇవ్వలేదు.. కుల గణనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు.. కులాలు మతాలు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు చారిత్రాత్మకం అని ఎంపీ బుట్టా రేణుక అన్నారు.
అయితే, మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మరోసారి పట్టం కట్టాలి అని ఆయన కోరారు. జగన్ సంక్షేమ పథకాలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.. జగన్ పాలనలో పేదలు మూడు పూట్ల ఆహారం తింటున్నారు.