
తెలంగాణలో ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. మరోపక్క ఏపీలోనూ రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. రోజుకో మాట, పూటకో వేషం వేసే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. ఏపీలో చంద్రబాబుతో జోడి కట్టిన పవన్.. తెలంగాణలో మాత్రం బీజేపీ పార్టీతో కలిసి నడిచేందుకు రెడీ అయ్యాడు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ (ఎక్స్ )లో పోస్ట్ చేశారు.
‘విలువలు లేని తమకే ఇది సాధ్యం’ అంటూ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. దీనికి సంబంధించి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో ఉన్న ఫోటో.. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబుతో దిగిన ఫోటోలను మంత్రి ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. పవన్ కు ఏదైనా సాధ్యమే.. విలువలు లేని రాజకీయాలు చేయాలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే చేయగలడు అంటూ మంత్రి అంబటి రాంబాబు విరుచుకుపడ్డారు.
విలువలులేని తమకే ఇది సాధ్యం !@PawanKalyan pic.twitter.com/J7b7qHf5dL
— Ambati Rambabu (@AmbatiRambabu) November 5, 2023