Leading News Portal in Telugu

Minister Jogi Ramesh: వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించాడు కాబట్టే చంద్రబాబును ప్రజలు ఓడించారు


Minister Jogi Ramesh: వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించాడు కాబట్టే చంద్రబాబును ప్రజలు ఓడించారు

వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించాడు కాబట్టే చంద్రబాబును ప్రజలు ఓడించారు అని మంత్రి జోగి రమేష్ తెలిపారు. జనసేన, టీడీపీ కలిసి పోటీ చేసినా ఓడిపోయేలా ప్రజలు చేయాలి.. పేద ప్రజల దేవుడు వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం.. సీఎం జగన్ ని గొప్ప నేతను చేసిన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. మా నడకకి, మా గెలుపుకి మూల స్తంభం పెద్దిరెడ్డి చేతుల మీదుగా వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ అద్భుతం అని ఆయన కొనియాడారు. కాంస్య విగ్రహం ఆవిష్కరణ అద్భుతంగా ఉందని మంత్రి జోగి రమేష్ అన్నారు.

ఇక, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ చాలా సంతోషంగా ఉంది.. 99.5% హామీలు నెరవేర్చాడు జగన్.. నా ఊరు అని చెప్పుకున్న వ్యక్తి ఏం చేసాడో చూడాలి.. విజయవాడలో ఉండేవాళ్ళంతా మా వాళ్ళే అని ఉపన్యాసాలిచ్చారు కానీ ఏం చేయలేదు గతంలో దేవాలయాలు కూల్చారు.. కరకట్ట ప్రొటెక్షన్ వాల్ కట్టలేకపోయారు అని ఆయన విమర్శించారు. అవినాష్ నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేసారు జగన్.. జన్మభూమి కమిటీలు పెట్టి కావలసిన వారికే అన్నీ చేయలేదు మీ లాగా.. సీఎం జగన్ నాలుగున్నరేళ్ళు అనేక సంక్షేమాలు చేసారు.. మీ పట్టణం అని చెప్పుకునే విజయవాడలో 14 ఏళ్ళు ఏం చేసారు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు.