
Adimulapu Suresh: సంక్షేమం, అభివృద్ధి జగన్ ప్రభుత్వ ముఖ్య లక్ష్యాలు అని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. యాత్రకు వెళ్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన చెప్పారు. నా ఎస్సీలు, నా బీసీలు అంటూ అక్కున చేర్చుకున్న జగన్.. ప్రతీ కష్టాన్ని తీరుస్తున్నారని మంత్రి తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రతీ పేదవాడు లబ్ది పొందుతున్నారని వెల్లడించారు. 2019లో ఒక్క అవకాశం అడిగిన జగన్‌కు ప్రజలు అవకాశం ఇవ్వటం వల్లే అభివృద్ధి సాధ్యమైందన్నారు. సీఎం జగన్ అభివృద్ధి అంటే కొత్త నిర్వచనం చెప్పారన్నారు.
చంద్రబాబు మోసపూరిత వాగ్దానాలు చేశారని.. అబద్ధాలు చెప్పి బెయిల్ తెచ్చుకున్నారని మంత్రి మండిపడ్డారు. అనారోగ్యం పేరు చెప్పి బయటకు వచ్చిన చంద్రబాబు కాన్వాయ్‌తో ర్యాలీగా ఎలా వచ్చారని ప్రశ్నించారు. ఆయన ఆరోగ్యం బాగుందని ఏఐజీ వైద్యులే చెప్పారన్నారు. ప్రజలు మోసపూరిత వాగ్దానాల ద్వారా మోసపోవద్దన్నారు. అప్పటి పాలనకు, ఇప్పటి సంక్షేమ పాలనను బేరీజు వేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయన్నారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పటానికి వచ్చిన మాకే బ్రహ్మరథం పడుతున్నారన్నారు.