
Meruga Nagarjuna: వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. సామాజిక సాధికారిత కోసం ఎంతో మంది పోరాటాలు చేశారని మంత్రి చెప్పారు. గతంలో కుల ప్రస్తావన తీసుకువచ్చి చంద్రబాబు అన్నీ కులాలను అవమానించారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో సామాజిక విప్లవానికి సీఎం జగన్ తెర తీశారని.. వెనుకబడ్డ కులాల అభివృద్ధికి సీఎం కృషి చేశారన్నారు.
రాష్ట్రంలో విద్య, వైద్యం, ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు మంత్రి మేరుగ నాగార్జున. 400 కోట్ల రూపాయల ఖర్చుతో బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కుల గణన చేపట్టడటం చారిత్రక అధ్యాయమని.. గతంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి అధికారంలోకి వచ్చి ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు. సీఎం జగన్‌ను ప్రజలు కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.చంద్రబాబు కుయుక్తులు మళ్లీ మొదలయ్యాయని.. అందరూ గమనించాలన్నారు. పేదరికంలో ఉన్న ప్రతీ పేదవాడు జగన్ వెన్నంటే ఉండి ఆదరించాలని ప్రజలను మంత్రి మేరుగ నాగార్జున కోరారు.