
Meruga Nagarjuna: మార్కాపురం సామాజిక, సాధికార యాత్రలో మంత్రి మేరుగ నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సామాజిక విప్లవాన్ని సీఎం జగన్ తీసుకువచ్చారని వెల్లడించారు. పేదలకు అండగా నిలబడి వారికి గుండె చప్పుడుగా ముఖ్యమంత్రి మారారన్నారు. పేదవాడి పిల్లలు ఉన్నత శిఖరాలను అధిరోహించాలనుకుని ఇంగ్లీష్ విద్యను జగన్ తీసుకువచ్చారని పేర్కొన్నారు. గతంలో ఆస్పత్రుల్లో అందని ద్రాక్షలా ఉన్న వైద్యాన్ని కార్పొరేట్ తరహాలోకి తీసుకువెళ్ళారని.. ప్రజల కోసం నిరంతరం ఆలోచించే ముఖ్యమంత్రి ఆయన తప్ప మరొకరు దొరకరని వ్యాఖ్యానించారు. గతంలో ఇచ్చిన వాగ్దానాలను మరచి చంద్రబాబు అండ్ కో మోసం చేశారని ఆరోపించారు.
రాష్ట్రంలో భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించాలన్నారు. పేదవారి ఇంటి తలుపు తడితే ప్రతీ ఇంటా ఆనందం వెల్లివిరుస్తుందన్నారు. బెయిల్‌పై బయటకు పవన్‌తో కలిసి చంద్రబాబు కుట్రలు చేసేందుకు వస్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రజలు అన్నీ గమనించాలన్నారు. రాష్ట్ర చరిత్రలో సీఎం జగన్ పాలనను సువర్ణ అక్షరాలతో లిఖించాలని మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు తొత్తులు ప్రజలకు మాయ మాటలు చెప్పేందుకు వస్తే వారికి సరైన సమాధానం చెప్పాలని ఆయన స్పష్టం చేశారు.