
శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో సీఎం జగన్ పర్యటనపై ఏపీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరీ స్పందించారు. ర్తెతులకు ఇచ్చిన హామీలను నేరవేర్చకుండా మోసం చేసిన సీఎం జగన్ బటన్ నొక్కడం కూడా మోసగించడమేనంటూ ఆమె మండిపడ్డారు. నా మీద చేసే విమర్శలు డ్తెవర్షన్ పాలిటిక్స్ మాత్రమే అని తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదు.. అవినీతి పేట్రేగిపోతోంది అంటూ పురంధేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయసాయి రెడ్డి ప్రతి ట్వీట్ ప్తె సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అన్నారు. ఆయనంత తెలివి నాకు లేదు.. ఏపీ మద్యం సేవించి ఎన్నో కుటుంబాలు చిధ్రం అయ్యాయి.. ఈ కుటుంబాలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత వ్తెసీపీప్తె ఉంది.. జనం ప్రాణాలు పోతున్న జేబులు నిండాలన్న ఆలోచన వారిలో ఉంది అని ఆమె తెలిపారు. జగన్ సర్కార్ రాష్ట్రంలో చేసే ప్రతి పనిలో అవినీతి కనిపిస్తుందని చెప్పుకొచ్చారు. ఏపీ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం సహాయ పడుతుంటే.. మొత్తం తామే చేసినట్లు జగన్ సర్కార్ ఫీల్ అవుతుందని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు.