Leading News Portal in Telugu

Superstar Krishna Statue: విజయవాడలో సూపర్‌ స్టార్‌ కృష్ణ విగ్రహం.. ఆవిష్కరించిన కమల్‌ హాసన్‌


Superstar Krishna Statue: విజయవాడలో సూపర్‌ స్టార్‌ కృష్ణ విగ్రహం.. ఆవిష్కరించిన కమల్‌ హాసన్‌

Superstar Krishna Statue: టాలీవుడ్‌ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు సినీ హీరో, పద్మ భూషణ్ కమల్ హాసన్.. విజయవాడ వచ్చారు కమల్.. భారతీయుడు 2 షూటింగ్‌ కోసం వచ్చిన ఆయన.. విజయవాడలోని గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన సూపర్‌ స్టార్‌ కృష్ణ విగ్రహాన్ని ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్‌ పాల్గొన్నారు.. ఇక, సూపర్‌ స్టార్‌ విగ్రహాన్ని ఆవిష్కరించడంపై ఆనందం వ్యక్తం చేశారు దేవినేని ఆవినాష్‌.. పదిరోజుల వ్యవధిలోనే కృష్ణ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన సీఎం వైఎస్‌ జగన్ కు కృష్ణ కుటుంబ సభ్యులు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తెలుగు ప్రజలందరి అభిమాన నటుడు కృష్ణ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు దేవినేని అవినాష్‌.. తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన నటుడు కృష్ణ అని కొనియాడారు.. అయన వారసత్వంతో ఇండస్ట్రీ లోకి వచ్చిన మహేష్ బాబు అటు సినీరంగంలో, ఇటు సేవా కార్యక్రమాల్లో ముందుంటు.. కృష్ణ పేరు నిలబెడుతున్నారని పేర్కొన్నారు.. ఇక, ఎప్పుడు షూటింగ్ లలో బిజీగా ఉండే కమల్ హాసన్.. ఇక్కడకు రావటం సంతోషంగా ఉందన్నారు.. నగర ప్రజల తరపున, సూపర్‌ స్టార్‌ కృష్ణ, మహేష్ బాబు అభిమానుల తరపున ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.. ఇదే సమయంలో.. 10 రోజుల వ్యవధిలోనే కృష్ణ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన సీఎం జగన్ కు.. కృష్ణ కుటుంబ సభ్యులు తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు దేవినేని అవినాష్‌.