Leading News Portal in Telugu

CPI Ramakrishna: ఏపీలో 18 జిల్లాల్లో తీవ్రమైన కరవు.. 440 మండలాల్లో దుర్భరమైన పరిస్థితి..!


CPI Ramakrishna: ఏపీలో 18 జిల్లాల్లో తీవ్రమైన కరవు.. 440 మండలాల్లో దుర్భరమైన పరిస్థితి..!

CPI Ramakrishna: ఆంధ్రప్రదేశ్‌లో 18 జిల్లాల్లో తీవ్రమైన కరవు నెలకొంది అన్నారు సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ.. రాష్ట్ర విభజన తర్వాత పంటలు వేయలేని దుస్థితిలో అన్నదాత ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 440 మండలాల్లో దుర్భరమైన పరిస్థితి ఉందన్న ఆయన.. నీటి ప్రాజెక్టు ల్లో నీరు లేక .. ఒక ఎకరాకు కూడా నీరివ్వడం లేదన్నారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మాత్రం అసలు కరవు గురించే మాట్లాడరు అంటూ ఫైర్‌ అయ్యారు.. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎక్కడ దాక్కున్నాడు..? రెవెన్యూశాఖ మంత్రి అసలు పత్తాలేడు..! అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల వై ఏపీ నీడ్స్‌ జగన్ కార్యక్రమంలో బిజీగా ఉన్నారని దుయ్యబట్టారు. ఈ మధ్యే సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో కూడా కరువుపై చర్చ చేయకపోవడం దుర్మార్గం‌ అన్నారు. రాయలసీమ నుంచి వలసలు పోతున్నా పట్టించుకోరు అని ఆరోపించారు. కృష్ణా జలాల విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ.. ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం చేశారని పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నికలలో లబ్ది కోసమే గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. ఇక, ఈ నెల‌ 20, 21 తేదీల్లో 30 గంటల పాటు నిరసన కార్యక్రమం విజయవాడలో చేపడతామని ప్రకటించారు సీపీఐ ఏపీ కార్యదర్శి కె. రామకృష్ణ.