Leading News Portal in Telugu

Andhrapradesh: దారుణం.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం మహిళ కళ్లల్లో కారం చల్లి, ఉరివేసి..



Arrest

Andhrapradesh: డబ్బుల కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారు జనాలు. బంధాలు, అనుబంధాలను కూడా పక్కన పెట్టేస్తున్నారు. బంధువులు అని కూడా చూడకుండా కర్కషంగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం యశోద అనే వివాహిత మహిళ కళ్ళల్లో కారం చల్లి, ఉరివేసి హత్య చేయబోయిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

Also Read: Viral Video: బైక్‌పై ఎద్దును కూర్చోపెట్టి రైడింగ్.. నువ్వు గ్రేట్ రా బుజ్జా..!

గుడిమెట్ల గ్రామానికి చెందిన యశోద అనే మహిళ తన భర్త నాలుగు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇన్సూరెన్స్ డబ్బు ఇవ్వాలని అత్త సమీప బంధువులు కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్నారని సదరు మహిళ ఆరోపించింది. ఈ క్రమంలో నేడు ఇన్సూరెన్స్ కాగితాలపై సంతకాలు చేయాలని, కళ్ళల్లో కారం కొట్టి తనపై దాడి చేసి ఫ్యాన్‌కి ఉరివేసి, హత్య చేయబోయారని బాధిత మహిళ తెలిపింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. ఆ బంధువులను పిలిచి విచారిస్తున్నట్లు సమాచారం.