Leading News Portal in Telugu

Cheddi Gang : తిరుపతిలో చెడ్డి గ్యాంగ్ హల్ చల్



Cheddi Gang

తిరుపతిలో చెడ్డి గ్యాంగ్ హల్ చల్ చేస్తోంది. మొన్న రాత్రి మారూతి షో రూంలో నిన్న రాత్రి శ్రీవారి విల్లాస్ లో చోరికి యత్నించారు. చెర్లోపల్లి వద్ద వున్న శ్రీవారి విల్లాస్ నెంబర్ 31లో చెడ్డి గ్యాంగ్ చోరికి పాల్పడ్డారు. ఊరి శివార్లో వున్న ఇళ్లను చెడ్డి గ్యాంగ్ టార్గేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం వేళలో రెక్కి నిర్వహించి రాత్రి సమయాలలో చోరి ఆపరేట్ చేస్తున్నాయి చెడ్డిగ్యాంగ్. రెండు సందర్భాలలోను ఎవ్వరు లేని సమయంలోనే చోరికి ప్రయత్నించింది చెడ్డిగ్యాంగ్‌.

Also Read : Palvai Shravanthi: బీఆర్ఎస్ లోకి పాల్వాయి స్రవంతి.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన కేటీఆర్

శుక్రవారం అర్థరాత్రి దాటినతరువాత సుమారు 1.30 గంటల సమయంలో ముగ్గురు చెడ్డీగ్యాంగ్‌ సభ్యులు షోరూమ్‌ వెనుక వైపు తలుపు పగులగొట్టి షోరూమ్‌లోకి చొరబడ్డారు. రాడ్లు, ఆయుధాలు చేతపట్టుకుని షోరూమ్‌ అంతటా గాలించారు. ఈ దృశ్యాలు షోరూమ్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఐతే షోరూమ్‌లో విలువైనవేవీ దొరకకపోవడంతో చెడ్డీగ్యాంగ్‌ వెనుదిరిగింది. తిరుపతి అలిపిరి పోలీసులు చెడ్డీగ్యాంగ్‌ ఆనుపానులకోసం గాలిస్తున్నారు. జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి తిరుపతిలోని పోలీస్‌ స్టేషన్లు, అధికారులనే కాకుండా జిల్లా పోలీసులను అప్రమత్తం చేశారు. గ్యాంగ్‌ కదలికలను గమనించేందుకు సీసీ పుటేజీలను పోలీసు సిబ్బంది గాలిస్తున్నారు. నగరంలోకి చెడ్డీగ్యాంగ్‌ ప్రవేశించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిఉంది.

Also Read : Advises Women: అమ్మాయిలూ జాగ్రత్త.. సోషల్ మీడియా ప్రొఫైల్ లాక్ చేసుకోండి లేదంటే..