Leading News Portal in Telugu

Indrakeeladri: ఇంద్రకీలాద్రి ఈవో కె.ఎస్.రామారావుకు అదనపు బాధ్యతలు


Indrakeeladri: ఇంద్రకీలాద్రి ఈవో కె.ఎస్.రామారావుకు అదనపు బాధ్యతలు

Indrakeeladri: విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఈవో కె.ఎస్.రామారావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాళహస్తి ఈవోగా రామారావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే బదిలీ అయిన ఆజాద్‌కు కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. అన్నవరం ఈవోగా రామచంద్ర మోహన్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆజాద్‌పై పలు ఆరోపణల నేపథ్యంలో కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. ఆజాద్‌కు గతంలో ఇచ్చిన బదిలీ ఉత్తర్వులను రద్దు చేసింది.

కాగా.. ఈ ఏడాది అక్టోబర్ 1న దుర్గగుడి ఈవో భ్రమరాంబను బదిలీ చేసిన ప్రభుత్వం.. డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారి ఎం.శ్రీనివాస్‌ను ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆయన విధుల్లో చేరకపోవడంతో కేఎస్‌ రామారావును దుర్గగుడి నూతన ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తక్షణమే దుర్గుగుడి ఈవోగా బాధ్యతలు చేపట్టాలని సర్కార్ ఆదేశించింది. శ్రీకాళహస్తి ఆర్డీవోగా పనిచేస్తోన్న కేఎస్ రామారావును దుర్గగుడి ఈవోగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మళ్లీ ఇప్పుడు తాజాగా శ్రీకాళహస్తి ఈవోగా అదనపు బాధ్యతలు చేపట్టారు.