
Seediri Appalaraju: విశాఖపట్నంలో జరిగిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో మంత్రి సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. దశాబ్దాలుగా బడుగు బలహీనర్గాల వారు సంక్షేమం, అభివృద్ధికి దూరంగా ఉన్నారని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు మైనార్టీలను టీడీపీ కూరలో కరివేపాకులా వాడిందని ఆయన మండిపడ్డారు. మత్స్యకారులను చంద్రబాబు బెదిరించారని ఆయన చెప్పారు. రూ. 150 కోట్లతో హార్బర్‌ను ఆధునీకరిస్తున్నారని.. సీఎం జగన్ పాలనలో పది హార్బర్ లు, నాలుగు పోర్టులు నిర్మిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. సుదీర్ఘమైన తీర ప్రాంతాన్ని చంద్రబాబు గాలికి వదిలేశారని.. మత్స్యకారుడిని రాజ్యసభకు పంపిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ది అంటూ పేర్కొన్నారు. బీసీలు జడ్జిలుగా పనికిరారని చంద్రబాబు లేఖలు రాశారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఆత్మ గౌరవంను చంద్రబాబు తాకట్టు పెట్టారన్నారు. అణగారిన వర్గాల ఆత్మ గౌరవంను ముఖ్యమంత్రి జగన్ కాపాడారని మంత్రి పేర్కొన్నారు. ఇంటిపై టీడీపీ జెండా కడితేనే పథకాలు ఇచ్చేవారని.. సీఎం జగన్ పాలనలో కులాలు మతాలు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా ముఖ్యమంత్రి జగన్ చేశారనారు. విశాఖ రాజదానిగా చేస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్నారు. విశాఖను రాజధాని కాకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతిని రాజధానిగా చేశారన్నారు.
Also Read: AP Ministers: పాత పద్ధతిలోనే మైనింగ్ లీజుల విధానాన్ని అమలు పర్చాలి.. మంత్రులకు విజ్ఞప్తి
ఒక ఊరిలో ఇద్దరు బాగుండాలి అంటే చంద్రబాబు.. ఊరు మొత్తం బాగుపడాలంటే జగన్ సీఎం కావాలని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. యాదవులకు పదవులు ఇస్తే ప్రతిపక్షాలు హేళన చేశాయన్నారు. పార్టీ పెట్టీ సీఎం కాకూడదనుకునే అపరిచిత వ్యక్తి పవన్ అంటూ విమర్శించారు. చంద్రబాబు సీఎం కావాలని కోరుకునే పవర్ లేని వ్యక్తి పవన్ కళ్యాణ్.. తండ్రి జైలులో ఉంటే ఢిల్లీ పారిపోయిన వ్యక్తి లోకేష్ అంటూ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్ దమ్మున్న నాయకుడని.. నేను మంచి చేస్తేనే నాకు ఓటు వేయాలని సీఎం జగన్ చెపుతున్నారని అనిల్ కుమార్ స్పష్టం చేశారు.