Leading News Portal in Telugu

AP Ministers: పాత పద్ధతిలోనే మైనింగ్ లీజుల విధానాన్ని అమలు పర్చాలి.. మంత్రులకు విజ్ఞప్తి



Mines

AP Ministers: నంద్యాల జిల్లా బనగానపల్లెలో నాపరాతి గనుల యజమానులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, కలెక్టర్ మున్జీర్ సామూన్ జిలానీ, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిలు పాల్గొన్నారు. ప్రభుత్వం పాత పద్ధతిలోనే మైనింగ్ లీజుల విధానాన్ని అమలు పర్చాలని నాపరాతి గనుల యజమానులు మంత్రులను కోరారు. గ్రానైట్, మార్భుల్స్ , టైల్స్ పరిశ్రమలతో పోటీ పడలేక నాపరాతి పరిశ్రమ నష్టాల్లో కూరుకొని పోయిందన్నారు.

Also Read: Yanamala Ramakrishnudu: బీసీల జోలికి వస్తే పతనమే.. టీడీపీ బీసీల పార్టీ

జీఎస్టీ 18 శాతం నుండి 5 శాతానికి తగ్గించామని మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి చెప్పారు. ప్రతిపక్షాలు పని గట్టుకొని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయని బుగ్గన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నిబంధన మేరకే పర్యావరణ పబ్లిక్ హియరింగ్ నిర్వహిస్తున్నామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. నాపరాతి మైనింగ్ లీజు 10 రెట్ల నుండి 5 రెట్లకు తగ్గించామని మంత్రి చెప్పుకొచ్చారు.